పవన్ ఆ మాటతో ... 'శ్రీమంతుడు' కాబోతున్న రాంచరణ్  

‘తిత్లీ’ తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, పవన్‌ కల్యాణ్ శ్రీకాకుళంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

Pavan Is Going To Adopt A Village In The Srikakulam Area RamCharan-

Pavan Is Going To Adopt A Village In The Srikakulam Area RamCharan

ఈ క్రమంలో రామ్‌చరణ్‌కు .పవన్‌ ఓ మంచి సలహా ఇచ్చారు. జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరారట. ఈ విషయాన్ని చరణ్‌ ప్రకటన ద్వారా తెలిపారు. ‘తుపాను బాధితుల పరామర్శ నిమిత్తం కల్యాణ్‌ బాబాయ్‌ శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటించినప్పుడు.. నష్టపోయిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని నాకు సలహా ఇచ్చారు. బాబాయ్‌ ఈ సూచన ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాయ్‌ సలహా పాటించాలని నిర్ణయించుకున్నా. గ్రామం దత్తత విషయమై నా బృందంతో చర్చించా. ఏ గ్రామం దత్తత తీసుకోవాలో నా బృందం గుర్తిస్తుంది. ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నానో త్వరలో ప్రకటిస్తా’ అని చరణ్‌ పేర్కొన్నారు.