కేఏ పాల్.ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఓ వెలుగు వెలిగి, ఆ సమయంలో రాజకీయ నాయకులకు ఒక కమెడియన్ గా ఆయన కనిపించాడు.2019 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ ఎక్కువగా ఉన్న సమయంలో తనదైన కామెడీతో రాజకీయ పరంగా నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు.చివరికి ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రచారం లోకి వెళ్ళిపోయాడు.తీరా ఎన్నికల తర్వాత రిజల్ట్స్ చూస్తే నోటా కంటే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు తెచ్చుకుని ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఎటో వెళ్లిపోయాడు.
అయితే మళ్లీ ఏమైందో ఏమో మరోసారి పొలిటికల్ లోకి కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా కేఏ పాల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు గుప్పించాడు.
ఇదివరకు 2008 లో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి ఎంపి పోస్ట్ తీసుకొని కాంగ్రెస్ లో విలీనం చేశాడని, ఆ తర్వాత 2013 లో మోదీ వెనక పవన్ కళ్యాణ్ తిరిగి ఆయన ఎంపీ సీటు ఇస్తారని ఆయనకు ప్రచారం చేశారని.చివరికి ఆయన సీటు ఇవ్వకపోవడంతో 2019లో మాయావతి పాదాల మీద పడ్డాడని దుయ్యబట్టారు.
అయితే తాజాగా ఇదివరకు పొమ్మన్న బిజెపి తోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి కలిశాడని కేఏ పాల్ విమర్శలు గుప్పించాడు.కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం ఇన్ని పార్టీలన్నీ ఇన్ని సార్లు మారాలా అంటూ విమర్శలు గుప్పించాడు.
ఓక బడుగు బలహీన వర్గాల పేరుని అడ్డంపెట్టుకుని ఇలా మోసం చేయకూడదు అంటూ అలాగే ఉపాధికి విధానం కొన్ని పాలసీలు ఉండాలంటూ పవన్ ఇలా చేయడం చాలా విచారకరం అంటూ ఆయన టార్గెట్ చేసుకొని పెద్దఎత్తున విమర్శలకు దారి తీశాడు.
ఇదివరకు 2019 ఎన్నికల సమయంలో కేఏ పాల్ పవన్ గురించి ఉద్దేశిస్తూ.
ఆయన తనతో కలిస్తే ఎన్నికల్లో ఆశీర్వాదం అందిస్తానని, అలాగే అతనిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించాడు.కాకపోతే, అవన్నీ అప్పుడు జరగలేదు.అయితే ఇప్పుడు కేఏ పాల్ గత ఎన్నికల్లో తనతో పవన్ కళ్యాణ్ కలవకపోవడం అతను చేసిన పెద్ద తప్పు అంటూ వ్యాఖ్యానించాడు.దీంతో ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జనసేన సభ్యులు నవ్వాలో, ఏడవాలో తెలియక అయోమయంలో ఉన్నారు.