గుంటూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్న పది మంది విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.శ్యామ్ అనే డిగ్రీ విద్యార్థి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసే అధిక మొత్తంలో విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి శ్యామ్న అదుపులోకి తీసుకున్నారు.అతని ఇచ్చిన సమాచారంతో మరో తొమ్మిది మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.
వీరంతా డ్రగ్స్ విక్రయ చెయిన్లో భాగంగా ఉన్నారని డిఎస్పీ సుప్రజ తెలిపారు.
పది మంది వద్ద నుండి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్, యాభై గ్రాముల గంజాయి, గంజాయి త్రాగడానికి ప్రత్యేకంగా తయారు చేసిన రెండు పెట్ బాటిల్స్ను, పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శ్యామ్ ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టైన కృష్ణారెడ్డి వద్ద నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల పిల్లలున్నట్లు కనుగొన్నారు.
డ్రగ్స్ బారిన పడిన విషయం ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకురావాలని డిఎస్పీ సుప్రజ విజ్ఞప్తి చేశారు.