పోలీసులకు ఇంగ్లీష్‌ రాకపోవడంతో నిర్దోషికి జైలు శిక్ష.. ఇది మన దేశంలో పోలీస్‌ వ్యవస్థ పనితీరు  

వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక్క దోషి కూడా శిక్షించబడకూడదు అనేది ఇండియన్‌ లా యొక్క ముఖ్య ఉదేశ్యం. అందుకే చిన్న కేసు అయినా ఎక్కువ కాలం విచారణ జరుపుతూ ఉంటారు. పలు విచారణలు, సిట్టింగ్‌లు, సాక్షులు విచారించిన తర్వాత అప్పుడు దోషి అని తేలితే శిక్ష వేయడం జరుగుతుంది. అయితే బీహార్‌ రాజధాని పట్నాలో పోలీసులు నిర్దోషి అయిన ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించి జైల్లో పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ విషయంతో బీహార్‌ పోలీసుల పరువు తీసింది.

Patna Police Didn't Know Difference Between Warrant Arrest Warrant-

Patna Police Didn't Know Difference Between Warrant Arrest Warrant

వివరాల్లోకి వెళ్తే.. నీరజ్‌ అనే వ్యక్తిపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టు ముందు హాజరు పర్చారు. అయితే తనపై తన భార్య తప్పుడు కేసు పెట్టింది అంటూ నీరజ్‌ సాక్ష్యాధారాలను ఇవ్వడం జరిగింది. దాంతో కోర్టు నీరజ్‌ ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు కాపీ ఇంగ్లీష్‌లో పట్నా పోలీసులకు పంపించడం జరిగింది. అయితే అందులో ఉన్న మ్యాటర్‌ పూర్తిగా అర్థం కాక పోవడంతో, సగం అర్థం అవ్వడంతో కోర్టు నీరజ్‌ను అరెస్ట్‌ చేయమని ఆదేశించినట్లుగా పోలీసులు భావించారు. దాంతో అతడిని జైలుకు తరలించారు. నీరజ్‌ మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు.

Patna Police Didn't Know Difference Between Warrant Arrest Warrant-

ఒక రోజు రాత్రి అంతా కూడా నీరజ్‌ జైలు జీవితానిన గడిపాడు. తెల్లవారిన తర్వాత నీరజ్‌ తరపు లాయర్‌ కోర్టు ఆర్డర్‌ చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే నీరజ్‌ను వదిలిపెట్టమని ఆదేశాలు ఉంటే మీరు ఎందుకు రాత్రి అంతా కూడా జైల్లో ఉంచారు అంటూ పోలీసులను లాయర్‌ ప్రశ్నించాడు. అయితే పోలీసులు మాత్రం తమకు ఇంగ్లీష్‌ సరిగా అర్థం కాకపోవడంతో తప్పు జరిగింది అంటూ నాలిక కర్చుకున్నారు. ఈ విషయాన్ని మరింత సీరియస్‌ చేయవద్దని నీరజ్‌ మరియు ఆయన తరపు లాయర్‌ను పోలీసు ఉన్నతాధికారులు కోరడంతో కోర్టుకు వెళ్లకుండా సైలెంట్‌ అయ్యారట. మొత్తానికి దేశంలో పోలీసు వ్యవస్థ మరీ ఇంత దారుణంగా ఉందని ఈ సంఘటన చెబుతోంది.

Patna Police Didn't Know Difference Between Warrant Arrest Warrant-