కరోనా కు బలైన న్యాయమూర్తి!

దేశంలో కరోనా పరిస్థితులు రోజు రోజుకు డేంజరస్ గా మారుతున్న విషయం తెలిసిందే.వరుసగా ప్రతి రోజు కూడా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50 వేలకు తగ్గకుండా నమోదు అవుతున్నాయి.

 Patna Family Court Judge Dies Of Covid, Patna Family Court Judge , Bihar, Aims H-TeluguStop.com

సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్న కరోనా ఇప్పుడు ఒక న్యాయమూర్తిని బలితీసుకుంది.ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే…పాట్నా ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి హరిశ్చంద్ర శ్రీవాస్తవ(58) గత కొద్దీ రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటం తో బుధవారం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం అని వెళ్లారు.అయితే ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా వాటిలో పాజిటివ్ ని తేలింది.

అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమించడం తో ఐసీయూ లో చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు.దీనితో శుక్రవారం నాడు చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

ఆయన మృతి తో బీహార్ రాష్ట్రంలో మొదటిసారిగా కరోనా కారణంగా ఒక జడ్జి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.బీహార్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ ద్వారా 1995 డిసెంబర్ నెలలో న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయనది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లా స్వ‌స్థ‌లం.

1995 నుంచి ఆయన న్యాయవాదిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన 2022 జులై 31 న పదవీ విరమణ చేయాల్సి ఉండగా, సడన్ గా కరోనా కాటుకు బలైపోయారు.ఆయన మృతి పై పలువురు న్యాయమూర్తులు,ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన అకాల మృతి తీరని లోటు అని వారంతా అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube