పతాంజలి హాస్పిటల్స్‌ వచ్చేశాయి... అందులో చికిత్స ఎలా ఉంటుందో తెలుసా?     2019-01-07   11:42:40  IST  Ramesh Palla

పతాంజలి అనే పేరు ఇండియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రూపంలో పతాంజలి ప్రోడక్ట్స్‌ ఉంటున్నాయి. పూర్తి సహజసిద్దమైన పద్దతుల్లో పతాంజలి వస్తువులను తయారు చేస్తున్నట్లుగా యోగా గురు బాబా రామ్‌ దేవ్‌ ప్రకటిస్తూ ఉంటాడు. వందకు పైగా వస్తువులు ప్రస్తుతం పతాంజలి నుండి వస్తున్నాయి. ప్రస్తుతం మనం రోజు వాడే వస్తువులు కెమికల్స్‌తో అనారోగ్యంతో ఉండే పదార్థాలతో కలిసి ఉండటం వల్ల వాటి వల్ల అనారోగ్యం బారిన పడుతూ ఉన్నాం. అందుకే పతాంజలి వారు పూర్తి సహజ సిద్దమైన పదార్థాలను అందించాలనే ఉద్దేశ్యంతో స్థాపించడం జరిగింది.

Patanjali Chikitsalaya Specialties-Patanjali Yogpeeth

Patanjali Chikitsalaya Specialties

పతాంజలి ప్రతి రంగంలో కూడా మొదలైంది. చివరకు పతాంజలి జీన్స్‌ కూడా ఆమద్య మార్కెట్‌లోకి వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. పతాంజలి వారి సోషల్‌ మీడియా చాటింగ్‌ యాప్‌ కూడా వచ్చింది. పతాంజలి నుండి ఎన్నో వస్తువులు, సేవలు వస్తూనే ఉన్నాయి. దేశం మొత్తంను పతాంజలితో నింపేయాలని రామ్‌ దేవ్‌ బాబా భావిస్తున్నాడు. అందులో భాగంగానే పతాంజలి హాస్పిటల్స్‌ కూడా వచ్చేస్తున్నాయి. దేశంలో వైధ్యం అనేది పెద్ద బిజినెస్‌ అయ్యింది. ఆ బిజినెస్‌ కాసులను పెంచుతుంది కాని, ఆరోగ్యాన్ని కాపాడటం లేదనేది పతాంజలి వారి అభిప్రాయం. అందుకే పతాంజలి హాస్పిటల్స్‌ తీసుకు వచ్చి ప్రజలకు మెరుగైన వైధ్యం అందించాలని భావిస్తున్నారు.

Patanjali Chikitsalaya Specialties-Patanjali Yogpeeth

పతాంజలి హాస్పిటల్స్‌లో ఎక్కువ శాతం ఆయుర్వేద పద్దతిలో చికిత్స ఉంటుంది. అదే సమయంలో రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌ కూడా ఉంటుందట. అయితే మందుల విషయంలో మాత్రం చాలా తేడా ఉంటుందని పతాంజలి వారు అంటున్నారు. ఇంగ్లీష్‌ మందులను ఎక్కువగా ఇవ్వకుండా చాలా తక్కువ మందులు ఇస్తూ, ఆ మందులు కూడా అవసరం ఉంటేనే వేసుకునేలా సూచనలు చేస్తున్నారు. ఇక ఆపరేషన్స్‌ మరియు ఇతరత్ర చికిత్స సమయంలో కూడా పతాంజలి పదార్థాలను వాడుతూ ఉన్నారు. పతాంజలి హాస్పిటల్‌ మొదటగా బెంగళూరులోని కంప్లి, సత్యనారాయణ పేటలో ఏర్పాటు చేశారు. అక్కడ మంచి ఆధరణ లభిస్తోంది. దాంతో భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా కూడా ఈ పతాంజలి హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తున్నారు.