ఇలా చేసిన తల్లిపాలలో కరోనా వైరస్ ఉండదట!

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా దెబ్బ తిసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.ఇంకా ఈ ఇప్పుడు మరో వార్త తెరమీదకు వచ్చింది.అది ఏంటి అంటే? పాశ్చరైజేషన్‌ చేసిన తల్లిపాలలో కరోనా వైరస్ ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 Breastfeeding , Mother's Milk, Mother's Milk Bank, Pasteurising Breast Milk, Chi-TeluguStop.com

అసలు పాశ్చరైజేషన్‌ చేసిన తల్లిపాలు అంటే? తల్లి పాలకు దూరమైనా శిశువులకు ‘తల్లిపాల బ్యాంకు’ల ద్వారా పాలు ఇస్తారు.అయితే తల్లిపాలను దానం చేసే మహిళల నుండి వాటిని తీసుకోని నిల్వ చేస్తారు.ఇంకా ఈ క్రమంలో కరోనా వైరస్ సోకినా మహిళలు దానం చేసిన పాలను కూడా 62.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో 30 నిముషాలు ఉంచి పాశ్చరైజ్‌ చేస్తే కరోనా వైరస్ ఉండదని అంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.

అయితే ఈ పాలను శిశువులకు ఇవ్వడం మంచిదే అని కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో పేర్కొన్నారు.

కాగా తల్లికి కరోనా వైరస్ సోకినా శిశువుకు తను స్వయంగా పాలు ఇవ్వచ్చు అని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.ఏది ఏమైనా ఇది కూడా ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube