'అర్జున్ రెడ్డి'ని మిస్ చేసుకున్న బ్యూటీ ఈమెనే.. పాపం ఇప్పటికి బాధ పడుతుందట!

టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.రోజు రోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.

 Parvati Nair Regrets Missing Out On Arjun Reddy, Arjun Reddy, Parvati Nair, Shal-TeluguStop.com

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.

అయితే విజయ్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా ఏది అంటే పెళ్లి చూపులు అనే చెప్పాలి.పెళ్లి చూపులు సినిమాతో మొదటి హిట్ కొట్టడమే కాకుండా ఈయన నటుడిగా హీరోగా గుర్తింపు కూడా పొందాడు.

ఆ తర్వాత చేసిన అర్జున రెడ్డి తో స్టార్ అయిపోయాడు.ఇక అక్కడి నుండి ఈయన వెనుతిరిగి చూసుకోవడం లేదు.

విజయ్ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా చాలా కీలక పాత్ర పోషించింది.ఈ సినిమా తోనే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని నటించిన విషయం తెలిసిందే.

ఈమె కూడా ఈ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

అర్జున్ రెడ్డి ఎలా పాపులర్ అయ్యాడో షాలిని కూడా ఆ రేంజ్ లోనే పాపులర్ అయ్యింది.ఈమెకు వరుస అవకాశాలు అయితే వరించాయి కానీ మళ్ళీ ఈ రేంజ్ లో హిట్ అందుకోలేదు.ప్రెజెంట్ బాలీవుడ్ లోనే నిలదొక్కుకోవడం కోసం శ్రమిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ ఆఫర్ ను తమిళ్ బ్యూటీకి వచ్చిందట.

ఆమె ఎవరో కాదు.పార్వతీ నాయర్ కు వచ్చిందని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.ఈమె మాట్లాడుతూ.

ఏ రంగంలో అయినా అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది అని.అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని.తనకు అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది.ఈమె ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువుగా ఉండడం వల్ల నో చెప్పిందట.కానీ సినిమా చూసాక ఇది ఒక అందమైన ప్రేమ కథ అని అనిపించింది.ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధ పడ్డాను అంటూ చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube