టాలీవుడ్ కమల్ హసన్ రాజేంద్రప్రసాద్ అంటున్న పరుచూరి

సౌత్ ఇండియాలో విలక్షణ నటుడు అంటే వెంటనే ఎవరైనా కమల్ హసన్ పేరు చెబుతారు.పాత్ర కోసం ఎలా అయినా మారిపోయే అలవాటు కమల్ హసన్ కి ఉంది.

 Paruchuri Praises On Rajendra Prasad Acting In Gali Sampath-TeluguStop.com

అలాగే తాను ఏ సినిమాలో నటించిన అందులో కేవలం పాత్రలు తప్ప కమల్ హసన్ అనే బ్రాండ్ ఎక్కడ కనిపించదు.ఈ కారణంగానే అతన్ని విలక్షణ నటుడుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గుర్తించింది.

అతని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు అంటే విక్రమ్ అని చెప్పాలి.అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కూడా విలక్షణ నటనకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు.

 Paruchuri Praises On Rajendra Prasad Acting In Gali Sampath-టాలీవుడ్ కమల్ హసన్ రాజేంద్రప్రసాద్ అంటున్న పరుచూరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు, స్టార్ హీరోలు ఉన్నా కూడా విలక్షణ నటుడుగా మాత్రం తమ ఐడెంటిటీని చూపించలేకపోయారు.అయితే టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ విలక్షణ నటుడు అని, అతను టాలీవుడ్ కమల్ హసన్ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.

పరుచూరి పలుకులు అని ప్రతి వారం ఏదో ఒక టాపిక్ మీద అతను మాట్లాడుతూ ఉంటారు.

ఈ నేపధ్యంలో గాలి సంపత్ సినిమా చూసిన తర్వాత రాజేంద్రప్రసాద్ ని కచ్చితంగా టాలీవుడ్ కమల్ హసన్ అనొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ చరిత్ర ఏ సిరాతో సినిమా అప్పటికి రాజేంద్ర ప్రసాద్ చిన్న నటుడు.ఆ సినిమాలో తొందరపడకు సుందరవదనా డైలాగ్ మాదిరిగా తొందరపడకుండా జీవితంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు.

ఇప్పటికీ ఆయన పాత్రనే ప్రధానంగా చేసుకుని టైటిల్స్ పెడుతున్నారు.గాలి సంపత్ కూడా ఆయన కోసం తీసినదే.

ఈ సినిమాలో ఆయన నటన చూస్తుంటే మన తెలుగులో కూడా ఒక కమలహాసన్ ఉన్నాడు అని అనిపించింది.గాలి సంపత్ పాత్రకి రాజేంద్రప్రసాద్ ప్రాణం పోశారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పడం విశేషం.

#Rajendra Prasad #Anil Ravipudi #Kamal Hassan #Gali Sampath #Paruchuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు