రంజితని అలా చూసి తట్టుకోలేక పోయానన్న రచయిత....  

Paruchuri Gopala Krishna About Telugu Actress Ranjitha-ranjitha,ranjitha And Paruchuri Gopala Krishna,ranjitha Latest News,ranjitha News,ranjitha Nithyanada Swamy,writer Paruchuri Gopala Krishna

తెలుగులో మంచి నటుడుగా అలాగే ప్రముఖ రచయితగా పరుచూరి బ్రదర్స్ కి ఎంత మంచి పేరు ఉందో చెప్పనవసరం లేదు.వీళ్లు తెలుగు సినీ పరిశ్రమకి మంచి మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను అందించారు.

Paruchuri Gopala Krishna About Telugu Actress Ranjitha-Ranjitha Ranjitha And Latest News Nithyanada Swamy Writer

అంతేగాక మంచి డైలాగ్ లతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ సీనియర్ నటిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ నటి ఎవరో కాదు రంజిత.రజిత అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నిత్యానంద స్వామి.

ఎందుకంటే తన సినీ జీవితం మంచి ఊపు మీద ఉన్న సమయంలో నిత్యానంద స్వామికి సేవ చేయాలనే  నెపంతో అతడి వద్దకు వెళ్లి పోయింది.అయితే ఈ విషయమై పరుచూరి గోపాలకృష్ణ ఆమె పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనని సినిమా పరిశ్రమకి తీసుకొచ్చింది తానే అని ఇందులో భాగంగా తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సమయంలో కడప రెడ్డెమ్మ చిత్రంలో అవకాశం ఇచ్చామని అన్నారు.అయితే ఈ అవకాశాన్ని రంజిత చక్కగా ఉపయోగించుకొని పలు సినీ అవకాశాలు కూడా దక్కించుకుంది.

కానీ మధ్యలో ఇలా తన సినీ జీవితాన్ని పాడు చేసుకుంటుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో సేవ పేరుతో నిత్యానంద స్వామితో ఏకాంతంగా గడిపినట్టు వంటి కొన్ని వీడియోలు బయటికి రావడంతో రంజిత సినీ జీవితం పై పెద్ద దెబ్బ పడింది.అంతేగాక అప్పట్లో ఈ విషయంపై కేసులు, విచారణలు అంటూ కూడా కొన్ని రోజులు రంజిత కోర్టుల చుట్టూ తిరిగింది.

తాజా వార్తలు