ఏపీలో పార్టీల పేర్లు మారిపోతున్నాయ్‌...

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు అనూహ్యంగా మారుతున్నాయి.ఎవ‌రు ఎవ‌రితో క‌లిసిపోతారో.

 Party Names Changed In Ap-TeluguStop.com

మ‌రెవ‌రు విడిపోతారో… ఇంకెవ‌రు క‌త్తులు దూస్తారో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.ఈ క్ర‌మంలోనే ఆయా పార్టీల నేత‌లు కొద్దిరోజులుగా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేస్తున్నారు…కాదు కాదు సెటైర్లు వేస్తున్నారు.

ప్ర‌త్య‌ర్థుల పార్టీల‌కు ఏకంగా మారుపేర్లు పెడుతున్నారు.పిల్ల పార్టీ, త‌ల్లిపార్టీ, తోక పార్టీ, బీ టీమ్‌కా చ‌క్క‌ర్ అంటూ ప‌ర‌స్ప‌రం తెగ సెటైర్లు వేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఈ మారు పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే టీడీపీని పిల్ల కాంగ్రెస్‌గా అభివ‌ర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే.

వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.అన‌వ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.అంతేగాకుండా.ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లిన చంద్ర‌బాబు అక్క‌డ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌తో కర‌చాల‌నం చేసిన విష‌యం తెలిసిందే.దీనిపై కూడా బుగ్గ‌న‌ భ‌గ్గుమ‌న్నారు.

రాహుల్‌గాంధీతో చేతులు కలుప‌డంతో ప్ర‌జ‌ల‌కు త‌ల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ ఎవ‌రో తెలిసిపోయింద‌ని ఆయ‌న సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ క‌లిసిన‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని బుగ్గ‌న ప‌రోక్షంగా విమ‌ర్శించారు.మ‌రోవైపు.ప్ర‌త్య‌ర్థుల పార్టీల‌కు మారుపేర్లు పెట్ట‌డంలో సీఎం చంద్ర‌బాబు కూడా ముందువ‌రుస‌లోనే ఉన్నారు.వైసీపీని అనేక సార్లు తోక‌పార్టీ అంటూ సెటైర్లు వేశారు.

ఇక తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్‌పై కూడా ఇలాంటి సెటైర్లే వ‌చ్చాయి.

బీజేపీ విష‌యంలోనూ బీటీమ్‌కా చ‌క్క‌ర్ అంటూ ఆ మాధ్య బాగా వినిపించింది.

ఇదిలా ఉండ‌గా… జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి కూడా ప‌లువురు నాయ‌కులు సెటైర్లు వేశారు.పిల్ల‌కాకి అంటూ గోల‌పెట్టారు.ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ పార్టీల‌కు మ‌రెన్ని మారుపేర్లు వ‌స్తాయో చూడాలి మ‌రి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube