జగన్ నిర్ణయాలపై పార్టీ నాయకుల..గుర్రు     2018-07-06   02:43:45  IST  Bhanu C

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఆ పార్టీ నాయకులు కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఎంత పార్టీ అధ్యక్షుడైతే మాత్రం ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకుని అవన్నీ మాపై రుద్దేస్తే ఎలా అంటూ వారు రుసరుసలాడిపోతున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి కలసి రావడం లేదని, తాము ఎంత ప్రయత్నం చేసినా..ప్రజల్లో పార్టీ పరువు పోతోందని వారు వాపోతున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా నిర్ణయాలు ప్రకటించి..తమపై రుద్దుతున్నారని దీంతో…ప్రజల్లో తాము చులకనయిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-

మొదటి నుంచి కూడా జగన్ వ్యవహారం విచిత్రంగానే ఉందని.. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను చెప్పిందే ఫైనల్ మీరు ఏమి చెప్పినా నేను వినదల్చుకోలేదు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తూ వస్తున్నదని, అందుకే తామంతా సైలెంట్ గా ఉండి మా రాజకీయ భవిష్యత్‌ కోసం ఆయన ఎన్ని తప్పులు చేసినా చూస్తూనే ఉన్నామని, ఇప్పుడు ఆయన చేస్తోన్న తప్పుల వల్ల మళ్లీ మరోసారి తమ పార్టీ ప్రతిపక్షహోదాకే పరిమితం అయ్యేలా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రత్యేకహోదా కోసం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని రెండేళ్ల క్రితం ప్రకటించిన జగన్ ఆ తరువాత ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలుసుకుని బిజెపితో రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాజీనామాలను ఆమోదింప చేసుకున్నారు అనే టాక్ ప్రజల్లో వచ్చేసింది….రాజీనామాలు చేసిన ఎంపీలను రాజధాని అమరావతికి తీసుకువచ్చి..ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి..హోదా కోసం తమ పార్టీ ఏం చేసిందో ప్రజలకు వివరించాల్సింది కానీ అదేమీ చేయలేదు.

మాజీలు అయిన ఎంపీలంతా ఎవరి నియోజకవర్గంలో వారైనా కార్యక్రమాలు నిర్వహించారా అంటే అదీ లేదు. మరి తాము చేసిన రాజీనామాలను ప్రజలు పట్టించుకోలేదని, దీని వల్ల లాభమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. బిజెపి , జనసేనతో రహస్య పొత్తు పెట్టుకున్నామని టిడిపి ప్రచారం చేస్తుంటే దాన్ని అడ్డుకోకుండా టిడిపిపై విమర్శలు చేస్తూ పబ్బంగడుపుకుంటున్నారని పార్టీ నాయకులే జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.