వంశీ పై బాబు నిస్సహాయత ? అదే కొంప ముంచిందా ? 

Party Leaders Pressured Chandrababu To Expel Vallabhaneni Vamsi From The Party

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా తన వ్యక్తిగత ,కుటుంబ సభ్యుల అంశాన్ని పదే పదే  తమ రాజకీయ ప్రత్యర్ధులు ప్రస్తావిస్తూ , విమర్శలు చేయడం పై చంద్రబాబు తీవ్ర అవేదన చెందుతూ ఉన్నారు.

 Party Leaders Pressured Chandrababu To Expel Vallabhaneni Vamsi From The Party-TeluguStop.com

ఇంత అవమానం నా జీవితం లో ఎదుర్కోలేదు అంటూ  కన్నీళ్లు పెట్టుకున్నారు.అసలు చంద్రబాబు కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించింది టిడిపి ఎమ్మెల్యేనే.ఆయన కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాడే.2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ  ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసిపికి దగ్గరయ్యారు.

వైసీపీలో చేరనున్న పరోక్షంగా ఆ పార్టీ మద్దతు ఇస్తూ,  అనధికారికంగా ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.ఆయన టీడీపీ కి దూరమై వైసీపీకి దగ్గరయ్యే సమయంలోనే అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన చేశారు.

 Party Leaders Pressured Chandrababu To Expel Vallabhaneni Vamsi From The Party-వంశీ పై బాబు నిస్సహాయత అదే కొంప ముంచిందా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా వంశీ ఘాటు పదజాలంతో చంద్రబాబు లోకేష్ పై విరుచుకు పడుతూనే ఉంటారు.అంతేకాదు వైసీపీని జగన్ ను ప్రశంసిస్తూ అనేక విమర్శలు బహిరంగంగా చేస్తూ ఉంటారు.

అయినా ఎప్పటి నుంచో ఆయనపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారు.

Telugu Ap, Cbn, Chandrababu, Gannavaram, Jagan, Kodali Nani, Mla Gannavaram, Nara Lokesh, Tdp, Vallabaneni Vamsi Mla, Ysrcp-Telugu Political News

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నేరుగా వైసీపీ లో చేరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు అనే ఆలోచనతో బాబు ఇంతగా నాన్చుడు ధోరణితో ఉంటున్నారు.ఇదే అదునుగా వంశీ తన నోటికి పని చెబుతూ వస్తున్నారు.సాంకేతికంగా ఇప్పటికీ వంశీ టీడీపీ ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నారు.

అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్న వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలకు బాబు కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు ఇంత వ్యవహారం చోటు చేసుకున్న తర్వాత అయినా, బాబు వంశీ విషయంలో నాన్చకుండా పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలనే డిమాండ్ సొంత పార్టీ నాయకుల నుంచే వ్యక్తం అవుతోందట.

#Kodali Nani #Chandrababu #Gannavaram #Jagan #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube