లోకేష్ లో పెరిగిన ధీమా ! క్యాడర్ లో భయం భయం ?

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పేరు ప్రస్తావనకు వస్తే, ఆ పార్టీలోని మెజారిటీ నాయకులు పెదవి విరుస్తారు.లోకేష్ కు రాజకీయ శక్తి సామర్ధ్యాలు లేవని, పార్టీని నడిపించే సామర్ధ్యం ఆయనకు లేకపోయినా, అనవసరంగా లోకేష్ ను తమపై కి రుద్ది చంద్రబాబు సరిదిద్దుకో లేని తప్పు చేస్తున్నారనే అభిప్రాయాలు ఆ పార్టీ నాయకుల నుంచే వస్తూ ఉంటాయి.

 Party Leaders Fearing Increased Confidence In Lokesh Nara Lokesh, Tdp, Chandrababu, Jagan, Ysrcp,ap Cm Jagan, Ap Government, Cbn,-TeluguStop.com

కొంతమంది అంతర్గత సంభాషణల్లో లోకేష్ పై విమర్శలు చేస్తూ ఉండగా, మరికొంతమంది మాత్రం బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉంటారు.పార్టీలోని సీనియర్ నాయకులు ఎవరికి లోకేష్ నాయకత్వంపై నమ్మకాలు లేవు.

ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు పలుమార్లు పార్టీ సీనియర్లు చెప్పారు.అయినా తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు పార్టీలోనూ ఆయనకు పట్టు పెరిగే విధంగా అన్ని బరువు బాధ్యతలు ఆయనపైనే పెట్టారు.

 Party Leaders Fearing Increased Confidence In Lokesh Nara Lokesh, TDP, Chandrababu, Jagan, Ysrcp,ap Cm Jagan, Ap Government, Cbn,-లోకేష్ లో పెరిగిన ధీమా క్యాడర్ లో భయం భయం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి తగ్గట్లుగానే లోకేష్ గత కొంతకాలంగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఏపీ అంతట తిరుగుతున్నారు.

కరోనా సమయంలోనూ కీలకమైన పార్టీ నాయకులను కలుస్తూ కొంతమందికి భరోసా ఇస్తూ , ధైర్యం పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు.

అలాగే తన ప్రసంగాలలోనూ పదునైన మాటలు ఉండేలా చూసుకుంటూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే డైలాగులతో  విరుచుకుపడుతున్నారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం అంటూ ధీమా గా చెబుతున్నారు.

లోకేష్ దూకుడు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.చంద్రబాబుకు తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించుకునేందుకు ఈ విధంగా తన డైలాగులకు పదును పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.

అయితే లోకేష్ లో వచ్చిన మార్పు టిడిపి నేతలలో పెద్దగా ఆసక్తి కలిగించడం లేదు.

 దీనికి కారణం లోకేష్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న భాష, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్స్ అన్ని ఆయనకు స్వతహాగా వచ్చినవి కాదు అని, కొంతమంది నిపుణులను నియమించి వారి ద్వారా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి స్తున్నారని, ఇక డైలాగులు సైతం ముందుగానే రాయించుకుని వాటిని బట్టీ పట్టించి లోకేష్ తో చెప్పిస్తున్నారు అనే అనుమానాలు టిడిపి నాయకుల్లో నెలకొన్నాయి. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంత వరకు పర్వాలేదు కానీ, ఆ తరువాతే లోకేష్ అసలు శక్తిసామర్ధ్యాలు బయటకు వస్తాయని ,ఆయన ఎంతటి సమర్ధుడు అనేది అప్పుడే తేలుతుందని స్వయంగా టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.పార్టీ నాయకుల అభిప్రాయం ఎలా ఉన్నా,  లోకేష్ లో  ధీమా బాగానే పెరిగింది.

అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube