పాలన బాగున్నా.. పలకరింపు ఎక్కడన్నా ? 

జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఓదార్పు యాత్రలు,  పాదయాత్రలు ఎన్నో చేశారు.

 Party Leaders Dissatisfied With Jagan's Failure To Reach Out To The Masses, Ap ,-TeluguStop.com

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే వరకు నిత్యం జనాల్లో ఉంటూ,  జనం మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ గుర్తింపుతో జనం లో జగన్ మమేకమై,  అందరి వాడిగా  పేరు సంపాదించుకున్నారు .ఆ జనాదరణే అఖండ మెజారిటీ తో అధికారంలో కూర్చోబెట్టింది.ఇక జగన్ సైతం తనను నమ్మి , తనకు ఈ స్థానం కల్పించిన ప్రజలకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,  ఇప్పటికీ జనాలకు ఇబ్బంది రాకుండా చూసుకుటున్నారు.

ఈ కరోనా కష్ట సమయంలోనూ సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు వస్తున్నా,  జగన్ మాత్రం జనాలకు వాటిని అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ,తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు , ఇలా ఎక్కడ చూసుకున్నా,  పార్టీ నాయకులు మాత్రమే ప్రచారానికి దిగారు తప్ప,  జగన్ ఎక్కడా ప్రచారానికి దిగలేదు.

  అయినా బంపర్ మెజారిటీతో వైసీపీకి విజయాలు దక్కాయి.

Telugu Ap, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

తిరుపతి ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయనే లెక్కలు బయటకు వస్తున్నాయి.జగన్ ఇదే ఈ విధంగా ముందు ముందు  వ్యవహరిస్తూ వెళ్తే ఆయనకు చిక్కులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనాల్లోకి వెళ్లింది పెద్దగా లేదు.

ఎక్కువగా ఆయన క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అయిపోతున్నారు.ఏపీలో ఏ కార్యక్రమంలో అయినా పార్టీ నాయకులు, అధికారులు కానిచ్చేస్తున్నారు తప్ప, జగన్ మాత్రం జనం లోకి వచ్చేందుకు   నాయకులకు సైతం రుచించడం లేదు .జగన్ జనంలోకి వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని,  పార్టీ గ్రాఫ్ తగ్గుతుంది అని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 70 ఏళ్ల వయసు దాటినా యాక్టివ్ గా ఉంటూ,  ఏదో ఒక కార్యక్రమంతో  హడావుడి చేస్తున్నారు.

అయినా జగన్ మాత్రం తన దర్శన భాగ్యం కల్పించకపోవడం,  ముందు ముందు జనాల్లో జగన్ కు ఆదరణ తగ్గేలా చేస్తుంది అనే టెన్షన్ పార్టీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube