తెలంగాణాలో గెలిచిన 19 మంది ఫిరాయింపు ఎమ్యెల్యేలు !

తెలంగాణాలో గత ఎన్నికల్లో అనంతరం టీఆర్ఎస్ పార్టీ తన ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా… నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా… సుమారు 25 మంది ఎమ్యెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు.వీరిలో అన్ని పార్టీలు అంటే… టిడిపి, కాంగ్రెస్ , సిపిఐ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ , బిఎస్పి ల నుంచి గెలుపొందిన వారు ఉన్నారు.

 Party Changed Mlas Are Win By Telangana Elections-TeluguStop.com

అలా చేరిన 25 మంది ఎమ్యెల్యేల్లో ఆరుగురు తప్ప మిగిలినవారంతా గెలవడం విశేషం.మొత్తం ఇరవై ఐదు మంది పార్టీ మారారు.

వీరిలో 19 మంది గెలవగా ఆరుగురు ఓడిపోయారు.

ఇల్లెందు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కోరం కనకయ్య ప్రస్తుతం ఓటమి చెందారు.అలాగే… ఖమ్మం నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలిచారు.వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), బానోతు మదన్‌లాల్‌ (వైరా), పాయం వెంకటేశ్వర్లు (పినపాక) ముగ్గురూ ఓడిపోయారు.

ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), ధర్మారెడ్డి (పరకాల), కాంగ్రెస్‌ నుంచి వచ్చిన రెడ్యానాయక్‌ (డోర్నకల్‌) మళ్లీ గెలిచారు.మిర్యాలగూడలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన భాస్కర్‌రావు, దేవరకొండలో సీపీఐ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన రవీంద్రకుమార్‌ గెలిచారు.నారాయణపేటలో టీడీపీ నుంచి వచ్చిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విజయం సాధించారు.బీఎస్పీ నుంచి టిర్ ఎస్ కు వచ్చిన ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ నుంచి, కోనేరు కోనప్ప సిర్పూర్‌ నుంచి విజయం సాధించారు.

ముథోల్‌లో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన విఠల్‌రెడ్డి గెలుపొందారు.హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో టీడీపీ నుంచి 9 మంది టీఆర్ఎస్ లో చేరారు.వీరిలో ఒక్కరు తప్ప అందరూ గెలుపొందారు.సనత్‌నగర్‌లో మంత్రి శ్రీనివాసయాదవ్‌, రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్‌, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌, కంటోన్మెంట్‌లో సాయన్న, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు.

మహేశ్వరం నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు.

చేవెళ్ల నుంచి గతంలో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కాలె యాదయ్య ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.తాజాగా అదే స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు.కాగా టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఓటమి చెందగా, అసెంబ్లీ రద్దు తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆర్.కృష్ణయ్య ఓడిపోయారు.టిడిపి తరపున సండ్ర వెంకట వీరయ్య ఒక్కరే మరోసారి విజయాన్ని అందుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube