నెల్లూరు జిల్లాలో మరో వైసీపీ నేతపై పార్టీ వేటు..!!

YSRCP Changes Udayagiri Party Incharge Kodavaluru Dhanunjaya Reddy,YSRCP, YS Jagan, Kottam Reddy, Nellore,Kodavaluru Dhanunjaya Reddy,Mettukuri,Nellore Politics,AP

నెల్లూరు జిల్లాలో రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది.ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

 Ysrcp Changes Udayagiri Party Incharge Kodavaluru Dhanunjaya Reddy,ysrcp, Ys Jag-TeluguStop.com

వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే.ఇదే సమయంలో ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

తన ఫోన్ ట్యాప్ చేశారని.అవమానించారని.

ఆరోపించడంతో ఆయనకి పార్టీకి సంబంధించిన పదవులు .విషయంలో వైసీపీ అధిష్టానం వేటు వేయడం జరిగింది.ఇదే సమయంలో నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డినీ నియమించడం జరిగింది.

Telugu Kottam Reddy, Mettukuri, Nellore, Ys Jagan, Ysrcp-Politics

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడీపై వైసీపీ పార్టీ వేటు వేయటం జరిగింది.పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు కొడవలూరు ధనుంజయ రెడ్డిని వైసీపీ తప్పించడం జరిగింది.ఇటీవల ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి…తన నియోజకవర్గనికి సంబంధించి.

ధనుంజయ రెడ్డి చిచ్చు పెడుతున్నట్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ పరిణామంతో ఉదయగిరి కొత్త పరిశీలకుడిగా నియమించిన మెట్టుకూరి ధనుంజయ రెడ్డిని పార్టీ పదవి నుండి పార్టీ అధిష్టానం తప్పించడం జరిగింది.

నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ నేతల విషయంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.తాజా పరిణామాలు చూస్తుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రక్షాళన కార్యక్రమం వైసీపీ అధిష్టానం చేపట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube