దేశంలో కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు.యూపీఏ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దామని తెలిపారు.
సొంత లాభం కోసమే విపక్షాలు పని చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.ఈ క్రమంలోనే విపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక తొమ్మిదేళ్లలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.లిక్కర్ స్కామ్ కు పాల్పడతారన్న మోదీ మళ్లీ వారినే వెనకేసుకొస్తారంటూ విమర్శలు చేశారు.
తమిళనాడులో అవినీతి రాజ్యమేలుతోందన్నారు.విపక్షాలకు కుటుంబం తరువాతే దేశ ప్రయోజనాలని చెప్పారు.
దర్యాప్తు సంస్థల విచారణ నుంచి తప్పించుకోవడమే విపక్షాల లక్ష్యమన్నారు.విపక్షాలు అవినీతికి మాత్రమే గ్యారెంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు.
కాగా ఇవాళ బెంగళూరులో విపక్ష పార్టీలు సమావేశం అయిన సంగతి తెలిసిందే.