ఐఫోన్ రింగ్‌టోన్‌ను అద్భుతంగా ఇమిటేట్ చేసిన చిలుక.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!

ఈ ప్రపంచంలో అన్ని జీవుల కంటే ఎక్కువగా ఆకట్టుకునేవి కొన్ని మాత్రమే ఉంటాయి.వాటిలో వివిధ రకాల శబ్దాలు ఇమిటేట్ చేసే జీవులు ముచ్చట గొలుపుతాయి.

 Parrot Imitates Iphone Ringtone Viral Video Details,  Iphone, Ringtone, Imitatio-TeluguStop.com

ఎక్కువగా పక్షులు మాత్రమే ఇలా ఇమిటేట్ చేయగల స్కిల్స్ కలిగి ఉంటాయి.ఒక్కోసారి అవి పర్ఫెక్ట్ గా కొన్ని శబ్దాలను చేస్తూ ఆశ్చర్య పరుస్తుంటాయి.

తాజాగా అలాంటి ఓ అద్భుతం చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తోందో పక్షి.ఈ పక్షి మరేదో కాదు మీరందరూ ఊహించిన రామచిలుకే!

తాజాగా ఈ రామచిలుక ఫేమ‌స్ ఐఫోన్ రింగ్‌టోన్ ని అచ్చుగుద్దినట్టు ఇమిటేట్ చేసింది.

ఐఫోన్ రింగ్‌టోన్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్నాచితకా షార్ట్ ఫిలిం, సీరియళ్ల నుంచి బడా సినిమాల వరకు అన్నింటిలోనూ ఈ ఐఫోన్ రింగ్‌టోన్‌ వినిపిస్తుంటుంది.

అయితే తన యజమాని ఐఫోన్ వాడుతుండటంతో దాని రింగ్‌ టోన్‌ను రామచిలుక దాని మైండ్ లో ఫిక్స్ చేసుకుంది.తర్వాత ఇమిటేట్ చేస్తూ ఆశ్చర్యపరిచింది.

ఈ రామచిలుక పేరు గుస్సీ. ఇది తన సహజమైన ప్రతిభతో ఐఫోన్ రింగ్ టోన్ ను ఇమిటేట్ చేసి తన యజమానిని ఆశ్చర్యపరిచింది.

మొదట్లో తనకు కాల్ వచ్చిందేమోనని యజమాని ఒకటి, రెండుసార్లు ఫోన్ చెక్ చేసుకున్నాడట.

కానీ ఫోన్ లో మాత్రం కాల్ వచ్చినట్లు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదట.అలా ఒక రోజు తన ముందే చిలుక అచ్చం ఐఫోన్ రింగ్‌టోన్‌ లాగానే సౌండ్ చేసిందట.అది చూసి అతను ఆశ్చర్యపోయాడట.

తర్వాత దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది వైర‌ల్ అవుతోంది.దీన్ని తిలకించిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వావ్, అద్భుతమని కామెంట్లు చేస్తున్నారు.తమకు కూడా అలాంటి రామచిలుక కావాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

జంతు ప్రేమికులు ఈ రామచిలుకలు చూసి ఫిదా అవుతున్నారు.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కు వేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube