వైరల్ వీడియో: ప్రాక్టీస్ సెషన్ లో ప్లేయర్ తల పై వాలిన రామచిలుక…!  

Parrot interrupts football practice in Brazil, Football Pratice, Parrot, Brazil, Viral Video,social media - Telugu Brazil, Football, Football Pratice, Goal, Ladies Football Team, Parrot, Parrot Interrupts Football Practice In Brazil, Viral Video

ఈ మధ్యకాలంలో జంతువులకు, పక్షులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇకపోతే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా కనపడుతోంది.

TeluguStop.com - Parrot Football Players Head Brazil

ఇక ఈ వీడియోలో బ్రెజిల్ మహిళల జాతీయ ఫుట్ బాల్ టీం సభ్యులు ప్రాక్టీస్ సెషన్ లో తలమునకలై ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.ఫుట్ బాల్ అంటే బ్రెజిల్ లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో వారు ప్రాక్టీస్ అయినా సరే, మ్యాచ్ అయినా సరే అంత సీరియస్ గానే సాధన చేస్తుంటారు.ఇలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ పెద్ద రామచిలక ఒకటి ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చి ప్రాక్టీస్ సెషన్ లో ఫుట్ బాల్ ఆడుతున్న ఓ మహిళ ప్లేయర్ బర్న బైరెట్స్ తలపై వచ్చి వాలింది.

TeluguStop.com - వైరల్ వీడియో: ప్రాక్టీస్ సెషన్ లో ప్లేయర్ తల పై వాలిన రామచిలుక…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ పరిణామంతో తో సదరు క్రీడాకారిని ఆశ్చర్యపోయింది.ఆమెతో పాటు అక్కడ ఉన్న మిగతా ఆటగాళ్లు కూడా ‘ ఇదేంటి ఇలా వచ్చింది.దీన్ని ఎవరైనా పెంచుకుంటున్నారేమో.అందుకే ఇలా మనుషుల దగ్గరకు సులువుగా వచ్చేసింది అంటూ’ అనుకున్నారు.

ఇలా వాలిన తర్వాత వెంటనే మరో వ్యక్తి వచ్చి ఫుట్ బాల్ సహాయంతో ఆ రామచిలుక క్రీడాకారిణి తలపై నుండి తప్పించి జాగ్రత్తగా అక్కడి నుంచి పంపించారు.ఇలా ఆమె తల నుండి ఎగిరి వెళ్లి గోల్ పోస్ట్ అవతలకు హాయిగా ఎగిరిపోయింది.

ఇది అంత అక్కడ ఉన్న కెమెరాలో రికార్డయింది.ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ మధ్య కాలంలో కొన్ని దేశాలలో అడవుల్లో కార్చిచ్చు లాంటివి ఏర్పడిన నేపథ్యంలో తమ ప్రాణాలను కోల్పోతున్నాయి.అలా జరగకుండా ఉంటే ఇలాంటి దృశ్యాలు కనిపించేవి కావేమో కాబోలు.

అయితే సదరు చిలుక ఎక్కడిదని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.బ్రెజిల్ దేశం లోని రియోడి జనీరో లోని ఓ అపార్ట్మెంట్ లో ఫ్యామిలీ నివసిస్తుంది.

వారు ఆ చిలుకను అత్యంత ఇష్టంగా పెంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ చిలుక ఎక్కువగా బయటకు వెళుతుంది.

ఇలా బయటికి వచ్చిన సమయంలో ఆ చిలుక దారితప్పి ఇలా క్రీడాకారిని తలపై వచ్చి వాలింది.దీంతో అరుదైన దృశ్యం కనబడింది.

#Parrot #Brazil #Football #LadiesFootball #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Parrot Football Players Head Brazil Related Telugu News,Photos/Pics,Images..