విపక్షాల ఆందోళనలు.... సభ నిరవధిక వాయిదా...!

రాజ్యసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది.8 రోజులు ముందుగానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.సభ సభ్యులలో కరోనా భయం నెలకొన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.సమావేశాలు జరగాల్సిన దానికంటే 8 రోజులు ముందుగానే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 Parliament Meetings Are Indefinite Deferral 8 Days Early Because Of Covid Pandem-TeluguStop.com

అలానే ఈ రోజు సాయంత్రం లోక్ సభ సమావేశాన్ని నిర్వహించి వాటిని కూడా వాయిదా వేయనున్నట్లు తెలుస్తుంది.మరో 8 రోజుల సమయం ఉన్నప్పటికీ సభ్యుల్లో నెలకొన్న కరోనా భయం నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క కేంద్రం మూజువాణి ఓటింగ్ పద్దతిలో సభలో వ్యవసాయ బిల్లులను పాస్ చేసిన నేపథ్యంలో విపక్షాలు అన్ని కూడా సభ సమావేశాలను మంగళవారం బహిష్కరించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు విపక్షాలు అన్ని కలిసి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు.

వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ విపక్ష ఎంపీ లు అందరూ కూడా పార్లమెంట్ ఆవరణలో ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు.అలానే ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను విపక్ష సభ్యులు కలవనున్నట్లు తెలుస్తుంది.

వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ రాష్ట్రపతి కి విన్నవించే ప్రయత్నం చేయనున్నాయి విపక్షాలు.మరి దీనిపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube