పార్లమెంట్ సమావేశాలు వాయిదా ?

కరోనా నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (బుధవారం) నుంచి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన సమావేశాల్లో ముగ్గురు ఎంపీలు కరోనా బారిన పడటంతో పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Delhi, Parliament, Corona, Mp Positive-TeluguStop.com

ఈ మేరకు గత శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాల నిర్వహణపై ప్రతిపక్ష నాయకులతో కలిసి చర్చించారు.కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి సమావేశాలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు రాజ్యసభ సమావేశాలు వాయిదా పడనున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభం కాగా.

షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల (అక్టోబర్) 1వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలి.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాకముందే లోక్ సభకు చెందిన 17 మంది ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్ గతవారం వైరస్ బారినపడ్డారు.శుక్రవారం రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధేకి కూడా కరోనా సోకింది.

దీంతో పార్లమెంట్ కఠిన చర్యలు తీసుకుంటోంది.తాజాగా లోక్ సభ సచివాలయం బులిటెన్ ను విడుదల చేసింది.

ఈ రోజు పార్లమెంట్ లో 11 ఆర్డినెన్స్ లను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.లోక్ సభలో జీరో అవర్ ముగిశాక ఐదు బిల్లులపై చర్చించి రాజ్యసభను వాయిదా వేసే అవకాశం ఉంది.

కాగా, రోజూ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే లోక్ సభ సమావేశాలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుందని సచివాలయం పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube