'పరిటాల' ఫ్యామిలీ పార్టీ మారాలనుకుంటుందా ?  

Paritala Sunitha And Her Son Wants To Join Ysrcp-paritala Family,paritala Sriram,paritala Sunitha,tdp,ys Jagan,ysrcp

తెలుగుదేశం పార్టీలో ‘పరిటాల’ కుటుంబానికి ఉన్న గుర్తింపే వేరు. మొదటి నుంచి టీడీపీతో పరిటాల రవి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఆయన హత్య అనంతరం ఆ కుటుంబాన్ని టీడీపీ కూడా బాగానే ఆదరించింది. రాప్తాడు నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చి మరీ గౌరవించింది. ఇంతవరకు బాగానే ఉన్నా పరిటాల వారసుడి విషయంలో చంద్రబాబు లైట్ తీసుకున్నట్టు కనిపించింది..

'పరిటాల' ఫ్యామిలీ పార్టీ మారాలనుకుంటుందా ? -Paritala Sunitha And Her Son Wants To Join Ysrcp

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్ కూడా టికెట్ ఆశించారు. అయితే ఒకే ఇంట్లో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని బాబు తేల్చి చెప్పేయడంతో సునీత తన టికెట్ ను వదులుకుని ఆ స్థానాన్ని శ్రీరామ్ కి కేటాయించేలా చేసుకుంది. అయితే అనూహ్యంగా శ్రీరామ్ ఓటమి చెందడంతో ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ ఆలోచనలో పడింది.

చివరికి నిమిషం దాక టికెట్ ఇచ్చే విషయంలో ఆలస్యం కావటం వలనే తాము ఓడిపోయామనే భావన ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ లో బలంగా నాటుకుపోయింది. అంతే కాకుండా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన జేసీ ఫ్యామిలీ కి రెండు టికెట్స్ ఇచ్చారు. కానీ ఎన్నో ఏళ్లగా పార్టీలో ఉంటున్న తమకి ఇవ్వకపోవటంతో పరిటాల ఫ్యామిలీలో అసంతృప్తి రేగింది. కానీ ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్, పరిటాల సునీత కోరిక మేరకు భద్రత పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నిర్ణయంతో పరిటాల ఫ్యామిలీ మీద తనకు ఎలాంటి ద్వేషం లేదని తెలిసేలా చేశాడు. ఇక జగన్ నుండి తమకి ఆలా మద్దతు దొరికేసరికి పరిటాల సన్నిహితులు, మనం వైసీపీ లోకి వెళితే ఎలా వుంటుందనే ఆలోచనలు లేవనెత్తినట్లు తెలుస్తోంది..

ఈ విషయంలో పరిటాల ఫ్యామిలీ మొత్తం సానుకూలంగా ఉన్నట్టు అనంతపురం రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు పరిటాల ఫ్యామిలీ కి అత్యంత సన్నిహితులు కొంతమంది వైసీపీ కీలక నాయకులతో చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో దీనిపై పూర్తి క్లారిటీ రాలేనట్టు అర్ధం అవుతోంది. అసలు పరిటాల ఫ్యామిలీ టీడీపీని వీడుతారనే వార్త ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే పరిటాల రవీంద్ర హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పాత్ర ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..

కానీ ఇప్పుడు జగన్ పార్టీలోకి పరిటాల ఫ్యామిలీ వెళ్లబోతుంది అనే వార్త అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.