పరిటాల వారసుడి కన్ను అక్కడ పడిందా ?  

Paritala Sri Ram Wants Stand In Dharmavaram-

అనంతపురం రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు ‘పరిటాల’ ఫ్యామిలీ.టీడీపీలో మొదటి నుంచి పరిటాల రవి ఫ్యామిలీకి గట్టి పట్టే ఉంది.ఈ జిల్లాను టీడీపీ కంచుకోటగా మార్చడంలో వీరి కృషి చెప్పలేనిది.అయితే అదంతా ఒకప్పుడు.పరిటాల రవి మరణాంతరం ఆయన భార్య సునీత ఆ బాధ్యతలు తీసుకున్నారు.ఎమ్యెల్యేగా, మంత్రిగా బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం కృషి చేశారు.అయితే ఈ జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కంచుకోటకు బీటలు పెట్టింది.ఆ ఎఫెక్ట్ కాస్తా పరిటాల వారసుడు శ్రీరామ్ మీద గట్టిగా పడడమే కాకుండా అతని రాజకీయ భవిష్యత్తుని గందరగోళం లోకి నెట్టేసింది.

Paritala Sri Ram Wants Stand In Dharmavaram--Paritala Sri Ram Wants Stand In Dharmavaram-

తన సీటు త్యాగం చేసి సునీత తన కుమారుడిని పోటీకి దింపినా ప్రయోజనం లేకుండా పోయింది.ఈ నేపథ్యంలో ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేద్దామన్న ఆలోచనలో శ్రీరామ్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ పరిటాల శ్రీరామ్ తన కంచుకోటగా మార్చుకుందామనుకున్న నియోజకవర్గం ధర్మవరం పై అందరిలో ఆసక్తి రేపుతోంది.అనంతపురం జిల్లా ధర్మవరంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.నేతల పక్కచూపులు, మరో కీలక నేత ఇటువైపు చూస్తుండటంతో, అందరి దృష్టి ఇప్పుడు ధర్మవరంపై పడింది.

గోనుగుంట్ల సూర్యనారాయణ.2009లో ధర్మవరం నుంచి ఇంటిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలో చేరడంతో పాటు ఇంఛార్జిగా వ్యవహరించారు.2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.అంతేకాదు నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు.అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిచెందారు.

వైసీపీ అధికారంలోకి రావడం, ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెలుపొందడంతో సూర్యనారాయణ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఇటీవల బీజేపీలో చేరారు.సూర్యనారాయణ పార్టీ మారడంతో ఒక్కసారిగా ధర్మవరంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ముఖ్యంగా రాప్తాడులో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్లాట్ ఫార్మ్ సిద్ధం చేసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.