ప్రభాస్ సినిమా కోసం ఏకంగా 30 కోట్లతో పారిస్ సిటీ

పారిస్ సిటీ చూడాలంటే పారిస్ వెళ్ళాలి.అంతే కాని ఇండియాలో ఎలా చూడగలం అని అనుకోవచ్చు.

 Paris City Set Design With 30 Crores In Annapurna Studio For Prabhas Movie-TeluguStop.com

కానీ చేతిలో సొమ్ములు ఉంటే, ఇంకా చెప్పాలంటే సినిమాలలో పారిస్ వెళ్ళకుండానే ఆ అద్బుత నగరాన్ని చూసేయోచ్చు.బాహుబలి మాహిస్మ్రుతి సామ్రాజ్యం ఎలా ఉంటుందో రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే ఇప్పటికి చూడొచ్చు.

అలాంటి అద్బుతమైన సెట్స్ కి మన కళా దర్శకులు రూపకల్పన చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో నిజంగానే అక్కడ ఉన్నట్లు సినిమాలో చూపించేస్తున్నారు.ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం రిట్రో స్టైల్ లో ఉన్న పారిస్ నగరాన్ని ఆర్ట్ డైరెక్టర్ నిర్మించేస్తున్నారు.

సాహో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా అంతా పారిస్ నేపధ్యంలో నడుస్తుంది.

దీంతో పారిస్ వెళ్లి సినిమా షూటింగ్ చేయడం అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి నిర్మాతలు పారిస్ సెట్ ని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా నిర్మించేస్తున్నారు.దీని కోసం ఏకంగా 30 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.

సినిమాలో మెజారిటీ పార్ట్ అంతా ఈ సెట్స్ లోనే పూర్తవుతుందని తెలుస్తుంది.మరి ఈ రిట్రో స్టైల్ లో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేస్తున్న ఈ పారిస్ సెట్ స్క్రీన్ పై ఎలా ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube