నా వల్ల కాదని తెగ ఏడ్చేసేదాన్ని : పరిణీతి చోప్రా

మనలో చాలామంది సినిమాల్లోని పాత్రల్లో నటించడం తేలిక అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.అయితే ఆ పాత్రల్లో నటించే వాళ్లకు మాత్రమే ఆ పాత్ర యొక్క కష్టం తెలుస్తుంది.

 Parineeti Chopra Shares Her Feelings On Training For Saina Nehwal Biopic , Parin-TeluguStop.com

సాధారణ పాత్రల్లో నటించడం సులభమే అయినా బయోపిక్ లలో నటించాలంటే మాత్రం అంత తేలిక కాదు.ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తున్నారు.

ఆ పాత్రలో నటించడం కోసం పరిణీతి చోప్రా పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.

క్రీడాకారుల బయోపిక్ లలో నటించడం సులభం కాదనే సంగతి తెలిసిందే.

క్రీడాకారిణిగా కనిపిస్తూ ఉండటంపై పరిణీతి చోప్రా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రోజూ ఉదయం రన్నింగ్ తో ఫిట్ నెస్ ప్రక్రియ మొదలయ్యేదని.

క్రీడాకారుల భావోద్వేగాలు ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా తాను సాధన చేసేదానినని ఆమె అన్నారు.అయితే ఈ పాత్రలో తాను సరిగ్గా నటించగలనో లేదో అని కొన్నిసార్లు ఏడ్చేసేదానినని పరిణీతి చోప్రా తెలిపారు.

అయితే చివరకు తాను సినిమాలో సైనాలా నటించాలని అనుకోలేదని.సైనాలా ఉండాలని అనుకున్నానని తెలిపారు.నా పాత్ర ఎలా ఉంటుందో ప్రేక్షకులు తెరపైనే చూస్తారంటూ పరిణీతి కామెంట్లు చేశారు.ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా స్పోర్ట్స్ ను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన సైనా సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాలీవుడ్ లో గతంలో కొందరి స్పోర్ట్స్ బయోపిక్స్ తెరకెక్కి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

సైనా సినిమాకు అమోల్ గుప్టే దర్శకత్వం వహించారు.పరిణీతి చోప్రాతో పాటు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్ కూడా షూటింగ్ సమయంలో తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube