సందీప్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన పరిణీతి చోప్రా

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా సందీప్ రెడ్డి చేసుకున్నాడు.

 Parineeti Chopra Interesting Comments On Sandeep Reddy-TeluguStop.com

ఆ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రసంసలు కురిపించాడు.ఈ నేపధ్యంలో నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని అందరూ భావించారు.

సందీప్ రెడ్డి కూడా మహేష్ కి స్టొరీ చెప్పి ఒప్పించాడని టాక్ నడిచింది.అయితే ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు.

 Parineeti Chopra Interesting Comments On Sandeep Reddy-సందీప్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన పరిణీతి చోప్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత సందీప్ రెడ్డి బాలీవుడ్ లోకి వెళ్లి అర్జున్ రెడ్డి మూవీని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ ని మొదటి చిత్రంతోనే రాబట్టిన దర్శకుడుగా బిటౌన్ లో టాక్ అఫ్ ది టౌన్ అయిపోయాడు.దీంతో బాలీవుడ్ లో చాలా మంది హీరోలు అతనితో నెక్స్ట్ సినిమా చేయడం కోసం ఆసక్తి చూపించారు.

Telugu Arjun Reddy Movie, Bollywood Ranabir Kapoor, Parineeti Chopra, Sandeep Reddy, Tollywood-Movie

అయితే నెక్స్ట్ సినిమాని తెలుగులో చేయాలనుకొని సందీప్ విశ్వ ప్రయత్నాలు చేశారు.అయితే అవేమీ వర్క్ అవుట్ కాకపోవడంతో హిందీలో రణబీర్ కపూర్ కి యానిమల్ అనే మూవీ స్టొరీ చెప్పి ఫైనల్ చేయించుకున్నాడు.ఈ మూవీని ప్రస్తుతం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ మూవీలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో తాజాగా బ్యూటీ సందీప్ రెడ్డి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది.సందీప్ రెడ్డితో పని చేసే ఛాన్స్ రావడం చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది.

అతని దర్శకత్వంలో వచ్చిన కబీర్ సింగ్ చూసా.చాలా బాగుంది.

యానిమల్ మూవీని కూడా కచ్చితంగా అద్బుతంగా తీస్తాడు.దీనిపై తనకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ మన దర్శకుడుని ఆకాశానికి ఎత్తేసింది.

మరి ఈ బ్యూటీ నమ్మకాన్ని సందీప్ రెడ్డి ఎంత వరకు నిజం చేస్తాడనేది చూడాలి.

#Sandeep Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు