ఆమెలా నటించాలి అనుకోలేదు, జీవించాలనుకున్న.. పరిణితి చోప్రా

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు తెరకెక్కడం ఎప్పటినుంచో వస్తున్నాయి.ఈ క్రమంలోనే పలువురు రాజకీయ వ్యక్తులు, సినీ సెలబ్రిటీలు, క్రీడాకారుల జీవిత కథలను ఆధారం చేసుకొనే ఎన్నో బయోపిక్ చిత్రాలు ఇప్పటివరకు తెరకెక్కి ప్రేక్షకులని సందడి చేశాయి.

 Parineeti Chopra I Didnt Want To Act Like Saina Nehwal I Want To Be Saina Commen-TeluguStop.com

ఈ క్రమంలోనే పరిణితి చోప్రా ప్రధాన పాత్రలో ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రంలో నటించారు.ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుండటంతో పరిణితి చోప్రా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా పరిణితి చోప్రా మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్లోనే ఎంతో చాలెంజింగ్ , ఎగ్జైటింగ్ సినిమా అని, పేర్కొన్నారు.సైనా నెహ్వాల్ కి ఉన్న సింప్లిసిటీ, సంకల్పబలం తన లక్ష్యాల పట్ల ఎంతో కఠినంగా ఉండేలా చేశాయని ఇంటర్వ్యూ సందర్భంగా పరిణితి చోప్రా తెలియజేశారు.

సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రంలో నటించడం కోసం తాను ఎంతో కష్టపడ్డానాని తెరపై తన బయోపిక్ పాత్రలో ఆమెలా నటించాలనుకోకుండా, జీవించాలని భావించానని ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Telugu Badmintonsaina, Biopic, Bollywood, Mar Dungi, Parineetichopra, Saina, Sai

ఎంతో కష్టపడి చివరికి తెరపై పరిణితి చోప్రా మాదిరిగా చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అయితే ఈ సినిమా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత “మే మార్ దూంగి” అనేది తన ఊత పదంగా మారిపోయినట్లు పేర్కొన్నారు.

Telugu Badmintonsaina, Biopic, Bollywood, Mar Dungi, Parineetichopra, Saina, Sai

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ బయోపిక్ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతుందని ఈ సినిమా కోసం తాను ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఎదురుచూస్తున్నానని, స్మాషింగ్ వీకెండ్ కోసం తనతో జాయిన్ అవ్వండి అంటూ ఈ సందర్భంగా పరిణితి చోప్రా తెలియజేశారు.ఇప్పటివరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఎంతో సందడి చేశాయి.మరి సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube