పరేష్ రావల్ చనిపోయాడంటూ ప్రచారం... ఫన్నీగా క్లారిటీ ఇచ్చిన నటుడు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా మహమ్మారి కాటుకి బలైపోతున్నారు.కాస్తా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కరోనా మరింత ప్రభావం వారిపై చూపిస్తూ ఉండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 Paresh Rawal Satirical Comments On His Death News, Corona Second Wave, Tollywood-TeluguStop.com

గత ఏడాది లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.ఈ ఏడాదిలో అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటులు, దర్శకులు, రచయితలు కన్నుమూస్తున్నారు.

రీసెంట్ గా టాలీవుడ్ లో లక్ష్మి రావే మా ఇంటికి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన నంద్యాల రవి కరోనాతో మృత్యువాత పడ్డారు.అలాగే అనిల్ రావిపూడి అసోసియేట్ కూడా కరోనాతో చనిపోయాడు.

ఇదిలా ఉంటే ఇదే అవకాశంగా సోషల్ మీడియాలో కొంత మంది తప్పుడు వార్తలని కూడా ప్రచారం చేస్తున్నారు.

పలానా సెలబ్రిటీ కరోనాతో చనిపోయారంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి నిజమని నమ్మేసి ప్రజలు కూడా కామెంట్స్ పెడుతున్నారు.ఇలాంటి వాటికి నేరుగా ఆ సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది.

కొద్ది రోజుల క్రితం శక్తిమాన్ సీరియల్ తో గుర్తింపు పొందిన నటుడు ముఖేష్ ఖన్నా చనిపోయారంటూ ప్రచారం చేశారు.దీనిపై ఆయనే నేరుగా నేను ఆరోగ్యంగా ఉన్నా అని స్టేట్ మెంట్ ఇచ్చారు.

తాజాగా స్టార్ యాక్టర్ పరేష్ రావల్ ని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు కరోనాతో చంపేసి పోస్టర్ వేసేశారు.దీనిపై ఆయన సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు.

పరేష్ రావల్ ఉదయం ఏడు గంటలకి చనిపోయారు అంటూ ఒకరు పోస్ట్ చేశారు.దీనిపై అతను కౌంటర్ గా తప్పుగా అర్ధం చేసుకున్నారు ఉదయం ఏడు గంటలకి నేను నిద్రపోతున్నాను అంటూ కౌంటర్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube