38 ఏళ్ల క్రితం కిడ్నాపైన పసిబిడ్డ.. ఇప్పుడు?

తల్లి పొత్తిళ్లలో ఎంతో హాయిగా ఆనందంగా పెరగాల్సిన ఓ బిడ్డను దుండగలు ఎత్తుకెళ్లి అమ్మ ప్రేమ, అనురాగాలకు దూరం చేశారు.ఆ బిడ్డ ఆచూకీ కోసం వెతకని ప్రదేశం అంటూ లేదు.

 Parents Reunite With Son Almost 4 Decade  After He Was Abducted As A Toddler  Pa-TeluguStop.com

ఆ తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఆ బిడ్డ కోసం ఎదురుచూశారు.పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

అయినా ఫలితం లేకపోయింది.అప్పటి నుండి ప్రతి క్షణం ఆ బిడ్డ ఆలోచనలతో ఎప్పుడు తిరిగివస్తాడా అని ఎదురు చూడసాగింది ఆ కన్నతల్లి.

చనిపోయేలోపు తన బిడ్డను కలుసుకోవాలనే వారి ఆశ.వారి బిడ్డను వారి చెంతకు చేర్చింది.అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం…

అది 1982వ సంవత్సరం చైనాలోని షాన్జీ ప్రావిన్స్‌లోని ఒక మారుమూల పల్లె.ఆ గ్రామంలో నివసించే సుబిగ్డే అతని భార్య హువాంగ్ రెంజ్యూ… తన ఇద్దరు బిడ్డలతో తన జీవితం ఎంతో హాయిగా ఉండేది.

అయితే ఒకరోజు తన భర్త తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సమయానికి లేట్ అవుతుందని, ఇంటి తలుపులు తెరిచే ఉంచమని చెప్పి వెళ్ళాడు.దీంతో అతని భార్య హువాంగ్ తలుపులు తెరచి నిద్రపోయింది.

ఇదే సమయంలో ఇంట్లో ఓ దొంగ చొరబడి తన పక్కన ఉన్న రెండు ఏళ్ళ బాలుడిని ఎత్తుకెళ్లి పోయాడు.

మెలుకువ వచ్చి చూడగా తన బిడ్డ పక్కన లేడన్న విషయం తెలుసుకుని తమ గ్రామంలోని ప్రజలకు తెలియ జేసింది.

దీంతో గ్రామస్తులు అందరూ కలిసి గ్రామం మొత్తం జల్లెడపట్టి వెతికారు.ఉదయం వచ్చిన తన భర్తకు ఈ విషయం తెలియగానే ఎంతగానో కుంగిపోయాడు.

ఆ బాలుడి కోసం వెతకని ప్రదేశం అంటూ లేదు.తమ బిడ్డ ఆచూకీ తెలుసుకుని పోలీసులను కూడా కోరారు, అయితే ఫలితం దక్కలేదు.

అయినా కూడా సుబిగ్డే తన బాబు ఆచూకీ కోసం నిరంతరం వెతుకుతూనే ఉన్నాడు.పోలీసులు కేసు మూసేయకుండా నిరంతరం పోలీసులను కలుస్తూ ఉండేవాడు.

అయితే నేషనల్ డేటాబేస్ లో ప్రజల డీఎన్ఏ శాంపిల్స్ ఉంటాయని, వాటి ద్వారా తమ వారసులు, బంధువులు ఎక్కడున్నా గుర్తించవచ్చని సుబిగ్డే తెలుసుకున్నాడు.తన డిఎన్ఏ తో సరిపోయే డిఎన్ఏ ఎవరికైనా ఉందేమోనని చూడాలని అధికారులను కోరారు.

లీ గౌలిన్ అనే వ్యక్తి యొక్క డిఎన్ ఏసుబిగ్డే డిఎన్ఏ నమోనాతో కలిసింది.దీంతో వారి చిన్నప్పుడు తప్పిపోయిన తన కుమారుడిని కలుసుకునేందుకు అవకాశం కలిసింది.

 లీ గౌలిన్ అతని భార్య ఇద్దరు పిల్లలు వీరు నివసిస్తున్న గ్రామానికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నారనే సమాచారం తెలియగానే తల్లిదండ్రులిద్దరూ బయలుదేరి తమ కొడుకు దగ్గరికి వెళ్ళారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube