భారత్ నుంచి ఛాంపియన్లు రావాలంటే.. తల్లిదండ్రులు మారాలి : ఇండియన్ కమ్యూనిటీతో కపిల్

తల్లిదండ్రులు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రోజున భారతదేశం ఛాంపియన్లను ఉత్పత్తి చేస్తుందని భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Parents Must Change To Bring Champions From India Kapil With Indian Community  K-TeluguStop.com

దీనిలో భాగంగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన కార్యక్రమానికి కపిల్ దేవ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకలకు అమెరికాలోని ప్రవాస భారతీయులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.కొన్నేళ్లుగా క్రీడల పట్ల భారతీయ తల్లిదండ్రుల మనస్తత్వం ఎంతగానో మారిపోయిందని కపిల్ అభిప్రాయపడ్డారు.కానీ దీనిపై ఇంకా చేయాల్సింది ఎంతో వుందన్నారు.ఆదివారం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చారిత్రాత్మక థామస్ కప్ విజయం సాధించిన నేపథ్యంలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లోని తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లుగా తయారు చేయాలనే కోరుకుంటారని.ఒక వేళ పేరెంట్స్ గనుక తమ పిల్లలను క్రీడాకారులుగా చూడాలనుకుంటే తాము ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దుతామని కపిల్ దేవ్ చెప్పారు.

దేశంలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే భారత క్రీడల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలనే దానిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.

Telugu Cup, Indian, Kapil Dev, York, Thomas Cup-Telugu NRI

ఈ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ చెప్పారు.తన కుమార్తె పదవ తరగతి పరీక్షకు హాజరవ్వాలి.అదే సమయంలో జూనియర్ ఇండియా కోసం ఆడాల్సి వస్తే.

చదువుకోమనే చెబుతానని కపిల్ తెలిపారు.కానీ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలలో మాత్రం ముందు దేశం కోసం ఆడి.వచ్చే ఏడాది పరీక్షకు వెళ్లమని చెబుతారని ఆయన వెల్లడించారు.మనదేశంలో ఆ ఆలోచనా విధానం ఇంకా మారలేదని కపిల్ దేవ్ పేర్కొన్నారు.

కానీ రాబోయే కాలంలో ఈ సరళి మారుతుందన్నారు.ఇదే సమయంలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన.తన స్పోర్ట్స్ కిట్‌ను స్కూల్ బ్యాగ్‌ను దాచుకుని, నిశ్శబ్ధంగా బయటకు వెళ్లి ఆడుకునేవాడినని పేర్కొన్నారు.అయితే ఇప్పుడు తల్లిదండ్రులే తమ పిల్లలను క్రీడలలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారని కపిల్ దేవ్ తెలిపారు.

ప్రస్తుతం తల్లిదండ్రులే తమ పిల్లలను ఆడుకోవడానికి తీసుకెళ్లడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.కపిల్ దేవ్ తన విజయాల ద్వారా దేశ నిర్మాణంలో క్రికెట్, క్రీడల భాగస్వామ్యాన్ని పెంచారని ప్రశంసించారు.అతని నాయకత్వంలో భారత్ 1983 ప్రపంచకప్ టైటిల్ గెలిచిందని.

నాటి క్షణాలు తమ మనసులో నిలిచిపోయాయని రణధీర్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube