మత్తులో పసి బిడ్డకి డ్రగ్స్ ఇచ్చిన తల్లిదండ్రులు! తరువాత ఏం జరిగిందంటే  

పసిబిడ్డకి డ్రగ్స్ ఇచ్చిన తల్లిదండ్రులు. .

Parents Gives Drugs To Their Child-child,parents Gives Drugs,spain Country

ఈ మధ్య కాలంలో డ్రగ్స్, చెడు వ్యసనాలకి బానిసలుగా మారిన యువతరం పెళ్లి తర్వాత సుఖాలకి అలవాటు పడి పెళ్లి తర్వాత పిల్లల పెంపకంలో బాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సారి పిల్లల విషయంలో దారునాలకి కూడా పాల్పడుతున్నారు. తాజాగా స్పెయిన్ లో ఓ అమానుష సంఘటన మరోసారి సంచలనంగా మారింది..

మత్తులో పసి బిడ్డకి డ్రగ్స్ ఇచ్చిన తల్లిదండ్రులు! తరువాత ఏం జరిగిందంటే-Parents Gives Drugs To Their Child

వ్యసనాలకి బానిసైన తల్లిదండ్రులు మత్తులో ఏడుస్తున్న పిల్లాడికి కూడా డ్రగ్స్ ఇచ్చేసారు. దీంతో పిల్లాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం 3 గంటకు పసిబిడ్డకు ఉన్నట్టుండి మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన తలిదండ్రులు ఆ పసిపాపను హుటాహుటిన దగ్గర్లో ఆసుపత్రికి తరలించారు.

వెంటన డాక్టర్లు బిడ్డకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. ఆ పాపకు మూత్ర పరీక్ష చేసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూత్ర పరీక్షలో బిడ్డ డ్రగ్స్ తీసుకోవడం వల్లే మూర్ఛ వచ్చిందని, ప్రస్తుతం కోమాలో ఉన్నట్టు తెలిపారు.

దీనిపై వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేశారు. పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోకుండా, ఇంట్లో డ్రగ్స్ పెట్టినందుకు వారిని అరెస్ట్ చేసారు. అయితే డ్రగ్స్ మత్తులోనే వారే పసిబిడ్డకి పాలు బదులు డ్రగ్స్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.