తస్మాత్‌ జాగ్రత్త : మీ పిల్లలు అల్లరి వారైతే ఇది తప్పకుండా చదవండి

ఈమద్య కాలంలో చిన్న పిల్లలకు జరుగుతున్న ప్రమాదాలు, వారి వల్ల పెద్ద వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కుప్పలు తెప్పలుగా మనం వార్తలు వింటూ ఉన్నాం.పిల్లల అల్లరి పనుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

 Parents Be Careful With There Kids-TeluguStop.com

ఆర్థికంగా మరియు ఇతర విషయాల్లో కూడా పిల్లల అల్లరితో నష్ట పోవాల్సి వస్తుంది.పిల్లలు ఉన్న వారు ఇప్పుడు నేను చెప్పబోతున్న పనులు చేసినట్లయితే కొంతలో కొంత అయినా నష్టనివారణ చేసుకోవచ్చు.

పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒకే రకంగా ఉండరు.కొందరు కామ్‌గా ఉండి అల్లరి చేస్తూ ఉంటారు, కొందరు మొత్తుకున్నా కాస్త జాగ్రత్తగా ఉంటారు.

ఇప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలను చూద్దాం.

Telugu Careful, Telugu General, Telugu-

పిల్లలకు గాయం చేసేది, నొప్పి కలిగించేది తెలియదు.ఒక వస్తువు కింద పడితే ఏమవుతుంది అనే విషయం వారికి తెలియదు.కనుక వారికి సాధ్యం అయినంత వరకు వస్తువులు అందకుండా పెట్టడం బెటర్‌.

ముఖ్యంగా బరువైన వస్తువులు, గాజు వస్తువులు, కదిలిస్తే పడిపోయే వస్తువులు మరియు బొమ్మలను వారికి దూరంగా ఉంచడం మంచిది.

పిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఎత్తుగా ఉండే టేబుల్స్‌ లేదంటే మరేదైనా ఎత్తుగా ఉండే డబ్బాలను కూడా పెట్టవచ్చు.

ఎందుకంటే దానిపైకి ఎక్కి కిందకు దిగేందుకు ప్రయతిస్తూ కింద పడిపోవడం, ఆ తర్వాత దెబ్బలు తగిలించుకోవడం జరుగుతుంది.

పెద్ద వారు వేసుకునే ట్యాబ్లెట్లను వారికి ఎంత వీలైంతే అంత దూరంగా ఉంచడం మంచిది.

ఎందుకంటే వారికి పెద్ద వారు వేసుకున్నట్లుగా తాము కూడా వేసుకోవాలనిపిస్తుంది.అల్లరి పిల్లలు కొందరు ట్యాబ్లెట్లను వేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

అందుకే పిల్లల ముందు ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.ఒక వేళ వేసుకున్నా వారికి అందకుండా పైకి లోనికి పెట్టాలి.

స్నానం చేయించే సమయంలో కొందరు పిల్లలు బాత్‌ రూంలో అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు.పిల్లల అల్లరితో కొన్ని సార్లు తల్లులు బాత్‌ రూంలో జారిపడటం కూడా జరుగుతుంది.

అందుకే పిల్లలు మరియు తల్లులు జాగ్రత్తగా ఉండాలి అంటే బాత్‌ రూంలో ఆచితూచి అడుగు వేయాలి.

Telugu Careful, Telugu General, Telugu-

పిల్లలకు కాయిన్స్‌ అస్సలు ఇవ్వొద్దు.పిల్లలు తెలియక నోట్లో పెట్టుకుంటారు.అవి కాస్త లోనికి జారిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

వంటగదిలో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి.పిల్లలు తెలిసి తెలియక వంట చేసేందుకు ప్రయత్నించడం, అమ్మ కోసినట్లుగా కూరగాయలను కోసేందుకు ప్రయత్నించడం చేస్తూ ఉంటారు.

Telugu Careful, Telugu General, Telugu-

చిన్న పిల్లలు ఉన్నారంటే తప్పకుండా తల్లులు మరియు తండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.బయటకు వెళ్లిన సమయంలో కూడా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి.ఆడపిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.నీచులు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు కనుక వారికి ముందస్తుగానే అలాంటి వారి గురించి హెచ్చరిస్తూ ఉండాలి.

ఈ ముఖ్యమైన సమాచారంను స్నేహితులతో షేర్‌ చేసుకోండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube