‘పార్దు’గా మహేష్‌బాబు  

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో త్వరలో ఒక చిత్రం రాబోతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికర విషయం చర్చ నడుస్తోంది. ‘ఖలేజా’, ‘అతడు’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రానికి ‘పార్దు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, రిజిస్ట్రర్‌ కూడా చేయించడం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్‌ మెగా హీరో అల్లు అర్జున్‌తో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను నిర్మిస్తున్న నిర్మాన సంస్థ హాసని ఎంటర్‌ప్రైజెస్‌ వారు తాజాగా ఫిల్మ్‌ చాంబర్‌లో ‘పార్దు’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. దాంతో ఆ టైటిల్‌ త్రివిక్రం శ్రీనివాస్‌ రిజిస్ట్రర్‌ చేయించాడని, మహేష్‌బాబుతో చేయబోతున్న సినిమా కోసం దాన్ని వాడే అవకాశాలున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ మూవీ తర్వాత మహేష్‌బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలో కూడా మహేష్‌బాబు నటించనున్నాడని అంటున్నారు.