జీవిత రాజశేఖర్ డబ్బులు ఎగ్గొట్టే రకమే అంటూ అప్పటి విషయాలు బయటపెట్టిన పరంధామ రెడ్డి!

టాలీవుడ్ ఇండస్ట్రీకి కల్మషం లేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్. ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Parandhama Reddy Comments On Jeevita Rajasekhar Details, Parandhama Reddy, Tollywood, Comment, Jeevitha Rajasekhar, Sekhar Movie, Financier Parandhama Reddy, 65 Lakh Rupees, City Civil Court, ,hero Rajasekhar, Parandhama Reddy Allegations-TeluguStop.com

ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్నాడు.ఇక ఈయన భార్య జీవిత కూడా ఇండస్ట్రీకి చెందిన నటి నే.గతంలో నటిగా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు దర్శకురాలిగా బాధ్యతలు చేపట్టింది.

ఇక ఇటీవలే జీవిత తన దర్శకత్వం లో ‘శేఖర్’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.

 Parandhama Reddy Comments On Jeevita Rajasekhar Details, Parandhama Reddy, Tollywood, Comment, Jeevitha Rajasekhar, Sekhar Movie, Financier Parandhama Reddy, 65 Lakh Rupees, City Civil Court, ,hero Rajasekhar, Parandhama Reddy Allegations-జీవిత రాజశేఖర్ డబ్బులు ఎగ్గొట్టే రకమే అంటూ అప్పటి విషయాలు బయటపెట్టిన పరంధామ రెడ్డి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో రాజశేఖర్ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమాకు బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లలో విడుదల చేయగా.ఈ సినిమాని ఆపేయాలి అంటూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకు ఈ సినిమాను ఆపివేయడానికి కారణం ఏంటంటే.ఫైనాన్సియర్ పరంధామ రెడ్డి తన దగ్గర తీసుకున్న రూ.65 లక్షలు ఇవ్వడం లేదని కోర్టుకు వెళ్ళాడు.దీంతో ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేవరకు ఆ సినిమాను థియేటర్స్, డిజిటల్, సాటిలైట్, యూట్యూబ్ లో ప్రసారం చేయకూడదు అని నెగటివ్ హక్కులను ఎటాచ్ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో జీవిత రాజశేఖర్ కూడా కోర్టును సంప్రదించబోతున్నారని సమాచారం అందింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా పరంధామరెడ్డి ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయట పెట్టాడు.రెండున్నరేళ్ల క్రితం జీవితకు రూ.65 లక్షలు ఇచ్చానని అన్నాడు.నెక్స్ట్ సినిమా ‘శేఖర్’ రిలీజ్ కు వారం రోజుల ముందు తీసుకున్న డబ్బులతో పాటు మంచి బెనిఫిట్స్ ఇస్తానని కూడా అన్నదట.

దీంతో సినిమాను మే 20న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాక.

తాను జీవిత వాళ్ళ ఇంటికి డబ్బుల కోసం బాగా తిరిగాడట.కానీ జీవితం మాత్రం పట్టించుకోలేదు అని.దాంతో తన దగ్గరున్న రికార్డ్స్ తో సిటీ కోర్టులో కేసు వేస్తానని అన్నాడు.దీంతో కోర్టు కూడా ఆ సినిమా మీద నెగటివ్ లైట్స్ తో ఎటాక్ చేసి తీర్పునిచ్చారని అన్నాడు.

ఇక ఆమె ఇంతవరకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని దాంతో తను కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు వేయనున్నానని తెలిపాడు.

గతంలో తాను రాజశేఖర్ నటించిన మహంకాళి సినిమాను నిర్మించాడట.ఆ పరిచయంతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే డబ్బులు ఇచ్చానని అన్నాడు.ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని దాంతో మంచి బెనిఫిట్ ఇస్తామని అనటంతో డబ్బులు ఇచ్చానని అన్నాడు.

డబ్బులు అడిగితే పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తుంది అని.ఆమె డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టే రకమని.ఇప్పటికే నగర కోర్టులో ఆమెపై కేసు వేశారు అని అన్నాడు.

ఆ కేసులో జీవితపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది అని.కానీ తన డబ్బుల విషయంలో ఆ దంపతులు ఎవరూ మాట్లాడటం లేదని.అంతకుముందు మహంకాళి సినిమాల్లోనూ కూడా జీవిత తనను మోసం చేసింది అని.ఇప్పుడు తను గడువు ఇవ్వను అని.అస్సలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని అన్నాడు పరంధామ రెడ్డి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube