ప్రక్షాళన మొదలెట్టిన పరాగ్ అగర్వాల్.. ట్విట్టర్‌‌లో కీలక ఉద్యోగులపై వేటు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ సీఈఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి ఎగ్జిక్యూటివ్ పరాగ్‌ అగర్వాల్‌ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.దీనిలో భాగంగా ట్విట్టర్‌ను ప్రక్షాళన చేసే పనులు మొదలుపెట్టారు.

 Parag Agrawal Shakes Up Twitter Security Team; 2 Senior Execs Leave, Parag Agraw-TeluguStop.com

ఇప్పటికే సంస్థలో కీలక పదవుల్లో వున్న కొంతమందిని తొలగించారు.భద్రతా విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్న పీటర్‌ జట్కో, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ రింకీ సేథీలు త్వరలో ట్విట్టర్‌ను వీడనున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో పరాగ్‌ తెలియజేశారు.

ప్రస్తుతం ప్రైవసీ ఇంజినీరింగ్‌ హెడ్‌గా ఉన్న లీ కిస్నర్కు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్న రివ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పరాగ్‌ ఉద్యోగులకు తెలియజేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో పేర్కొంది.

జాక్ డోర్సీ నుంచి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పరాగా అగర్వాల్ వచ్చి రాగానే.చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా వున్న డాంట్లీ డేవిస్, ఇంజనీరింగ్ విభాగం చీఫ్ మైఖేల్ మోంటానాను ఆ పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే.పరాగ్ అగర్వాల్ విషయానికి వస్తే.ముంబైలో పుట్టిపెరిగిన ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదివారు.మైక్రో‌సాఫ్ట్‌, యాహూ తది‌తర టెక్ సంస్థ‌ల్లో పని‌చే‌శారు.అనంతరం 2011లో ట్విటర్‌లో చేరారు.అనతికాలంలోనే తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగిన పరాగ్ అగర్వాల్‌కు 2017లో సీటీఓగా పదోన్నతి లభించింది.

తాజాగా సీఈవోగా పదవిని చేపట్టడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పరాగ్ చెప్పారు.డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్టు ఆశిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, సీఈవో పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు.

Parag Agrawal Shakes Up Twitter Security Team; 2 Senior Execs Leave, Parag Agrawal,Twitter CEO, Twitter Security Team,CEO Parag Agarwal, - Telugu Parag Agrawal, Ceo, Security #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube