పేపర్ పాలిటిక్స్: అక్కడ వైసీపీ పత్రిక హవానే ఎక్కువట…!  

paper politics : in that area ysrcp supported paper media, ysrcp, jagan mohan reddy, andhra pradesh chief minister, local media, ysrcp media, TDP government - Telugu Andhra Pradesh, Chief Minister, Jagan Mohan Reddy, Media, Tdp Government, Ysrcp

ఏపీ రాజకీయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మీడియా కూడా పార్టీల వారీగా విడిపోయి రాజకీయాలని నడిపిస్తున్న విషయం తెలిసిందే.

TeluguStop.com - Paper Politics In That Area Ysrcp Supported Paper Upper Hand

కొన్ని మీడియా సంస్థలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే, మరి కొన్ని సంస్థలు ప్రతిపక్ష టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నాయి.ఇక ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

అయితే కొన్ని న్యూట్రల్‌గా ఉండే మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.

TeluguStop.com - పేపర్ పాలిటిక్స్: అక్కడ వైసీపీ పత్రిక హవానే ఎక్కువట…-Political-Telugu Tollywood Photo Image

వాటి విషయం పక్కనబెడితే.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన మీడియా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అదే సమయంలో ప్రత్యర్ధి మీడియా సంస్థలని తోక్కేసే ప్రయత్నం జరుగుతుంది.గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు హయాంలో ఇలాగే జరిగింది.

అప్పుడు టీడీపీ అనుకూల మీడియా, పేపర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.అలాగే ప్రత్యర్ధి మీడియా సంస్థలకు చెక్ పెట్టేవారు.

ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది…అంటే ఇంకా ఏ మీడియా హవా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.పెద్ద మొత్తంలో ఆ మీడియా చానల్, పత్రికకే ఎక్కువ ప్రభుత్వ ప్రకటనలు వెళుతున్నాయి.

అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా, పత్రికలకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఏపీలో చాలాచోట్ల కేబుల్ టీవీల్లో టీడీపీ అనుకూల మీడియా అడ్రెస్ లేకుండా పోయింది.

ఇక ప్రభుత్వ ప్రకటనల విషయంలో వైసీపీ అనుకూల పత్రికదే హవా.మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లో వైసీపీకి చెందిన పత్రికనే ఉండాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయట.అలాగే దానికి సంబంధించి ముందే అడ్వాన్స్ బిల్లులని తీసుకుంటున్నారట.అంటే సచివాలయాల్లో జగన్ పార్టీకి సంబంధించిన పత్రిక కాకుండా మరో పత్రిక ఉండదని తెలుస్తోంది.

ఇదే అంశంపై టీడీపీ అనుకూల మీడియా గగ్గోలు పెడుతుంది.ఇది అన్యాయమని వాదిస్తుంది.

అయితే ఈ విషయం టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చెబితే బాగుండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

#Ysrcp #Chief Minister #Media #Andhra Pradesh #TDP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Paper Politics In That Area Ysrcp Supported Paper Upper Hand Related Telugu News,Photos/Pics,Images..