విలేజ్ లో అందరిని ఆకట్టుకుంటున్న బొప్పాయి వినాయకుడు.. !!

వినాయకుడిని పూజించడం వల్ల మనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.అలాగే వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన పచ్చటి పందిళ్లు, తోరణాలు, పాటలు, వినాయకుడి విగ్రహాలే దర్శనం ఇస్తాయి.

 Papaya Ganesha Impresses Everyone In The Village, Village, Vinayaka, Boppaya, Vi-TeluguStop.com

రకరకాల ఆకారాలలో వినాయకుడిని తయారు చేసి పూజలు చేస్తూ ఉంటాం.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిలాల్లో ఒక వింత వినాయకుడు వెలిసాడు.

బొబ్బాయి పండు రూపంలో ఉన్న ఆ వినాయకుడును చూడడానికి భక్తులు తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు.మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలో గల అరసబలగ గ్రామంలో ఈ వింత ఆకారంలో వినాయకుడు దర్శనమిచ్చాడు.ఆ గ్రామ సర్పంచ్‌ సాయిరాం ఇంటి వద్ద ఉన్న బొప్పాయి మొక్కకు వినాయకుడి ఆకారంలో ఉన్న ఒక బొప్పాయి పండు కాసింది.

అచ్చం బొప్పాయి పండుకు వినాయకుడి ఆకారంలోనే చెవులు, తొండం ఉన్నాయి.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి గ్రామం మొత్తం తెలియడంతో భక్తులు తండోపతండాలుగా ఆ బొప్పాయి ఆకారంలో ఉన్న గణనాధుడిని చూసేందుకు సర్పంచ్ సాయిరాం ఇంటికి క్యూ కట్టారు.

సాక్షాత్తు తమ గ్రామాన్ని కాపాడడానికి ఆ వినాయకుడే మా గ్రామంలోకి వచ్చాడని భావించి బొప్పాయి పండుకు పసుపు కుంకుమలు, పూలతో పూజలు చేయడం మొదలుపెట్టారు.అలాగే కొబ్బరి కాయలు, అరటిపళ్ల ప్రసాదంగా పెట్టి మొక్కుకున్నారు.

కార్తీక మాసంలో ఇలా వినాయకుడు దర్శనం ఇవ్వడంతో మంచి శుభసూచకంగా అక్కడి గ్రామ ప్రజలు భావిస్తు ఆ బొప్పాయి పండు రూపంలో ఉన్న వినాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube