సింగపూర్ లో మరోసారి పీఠం అందుకున్న అధికార పార్టీ!  

Singapore ruling PAP party wins elections,PAP, Elections, Singapore Prime Minister, Lee Hsien Loong - Telugu Elections, Lee Hsien Loong, Pap, Singapore Prime Minister, Singapore Ruling Pap Party Wins Elections

ఇటీవల సింగపూర్ లో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి కి అధికార పార్టీ అడ్డుకట్ట వేసింది.తాజాగా శుక్రవారం అక్కడ చోటుచేసుకున్న ఎన్నికల్లో అధికార పార్టీ “పీపుల్స్ యాక్షన్ పార్టీ” మరోసారి అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది.

 Pap Elections Pm Lee Hsien Loong

ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడుతుండగా సింగపూర్ లో మాత్రం లెక్క చేయకుండా ఎన్నికలు నిర్వహించారు.ఇలా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ఎన్నికలు జరిగిన దేశాల్లో అతిచిన్న దేశంగా సింగపూర్ నిలిచింది.

ఈ కరోనా టైం లోనే ఏప్రిల్ లో దక్షిణ కొరియా, అలానే జూన్ లో సెర్బియా దేశాలు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే.గతనెల 23 న పార్లమెంట్ ను రద్దు చేస్తూ అక్కడి ప్రధాని లీ హసీన్ లూంగ్ అనూహ్యనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.2021 జనవరి వరకు పార్లమెంట్ గడువు ఉన్నప్పటికీ కూడా ఆరునెలల ముందే పార్లమెంట్ ను రద్దు చేస్తూ అక్కడి ప్రధాని నిర్ణయం తీసుకోవడం తో అక్కడ ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.దీనితో తాజాగా శుక్రవారం అక్కడ జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ నే విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.

సింగపూర్ లో మరోసారి పీఠం అందుకున్న అధికార పార్టీ-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో లూంగ్ మరోసారి సింగపూర్ ప్రధాని గా అధికార పీఠం ఎక్కనున్నారు.

ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ ని కేవలం పది స్థానాలకే పరిమితం చేస్తూ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.దీనితో లూంగ్ మరోసారి సింగపూర్ ప్రధాని గా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది.2004 లో ప్రధాని గా లూంగ్ ప్రమాణస్వీకారం చేయగా అప్పటి నుంచి కూడా ఆయనే ప్రధాని గా కొనసాగుతూ వస్తున్నారు.

#Lee Hsien Loong #Elections #PAP

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pap Elections Pm Lee Hsien Loong Related Telugu News,Photos/Pics,Images..