అక్కడకు కూడా వెళ్తున్న 'దృశ్యం 2'.. చేసేది ఎవరో?

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం ను తెలుగు, తమిళం మరియు హిందీ ల్లో రీమేక్ చేసిన విషయం తెల్సిందే.మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Panorama Studios Take Hindhi Drushyam 2 Movie Remake 2-TeluguStop.com

దృశ్యం కు సీక్వెల్‌ గా మలయాళం లో దృశ్యం 2 రూపొందిన విషయం తెల్సిందే.అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అయిన దృశ్యం 2 కు మంచి స్పందన వచ్చింది.

భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం 2 సినిమా ను ఇప్పటి కే తెలుగు లో వెంకటేష్‌ మరియు మీనా కీలక పాత్రలో రీమేక్ మొదలు పెట్టారు.తెలుగు లో జూన్‌ లో ఈ రీమేక్‌ ను విడుదల చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

 Panorama Studios Take Hindhi Drushyam 2 Movie Remake 2-అక్కడకు కూడా వెళ్తున్న దృశ్యం 2’.. చేసేది ఎవరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి సమయంలో హిందీ రీమేక్ కు సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చింది.

దృశ్యం 2 హిందీ రైట్స్ ను పనోరమ స్టూడియోస్‌ వారు దక్కించుకున్నారు.

దృశ్యం మొదటి పార్ట్‌ హిందీ వర్షన్ లో అజయ్ దేవగన్ మరియు శ్రియ శరన్‌ లు జంటగా నటించారు.ఒరిజినల్‌ వర్షన్‌ కు చాలా మార్పులు చేర్పులు చేసి హిందీ దృశ్యం 2 ను తెరకెక్కించం జరిగింది.

హిందీ లో అవే మార్పుల తో దృశ్యం 2 ను కూడా తెరకెక్కిస్తారనే వార్తలు వస్తున్నాయి.అయితే అజయ్ దేవగన్‌ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడా లేదంటే మరో హీరో ఎవరైనా దృశ్యం 2 ను చేస్తారా అనేది చూడాలి.

అన్ని భాషల్లో కూడా మొదటి పార్ట్‌ హీరో నటిస్తున్న కారణంగా హిందీ లో కూడా ఆయనే నటిస్తాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.త్వరలోనే దృశ్యం 2 కు సంబంధించిన హిందీ చిత్రీకరణ మొదలు కాబోతుంది.

అప్పుడు హీరో గా నటించేది ఎవరు అనే విషయమై క్లారిటీ రాబోతుంది.మరో వైపు తమిళం దృశ్యం 2 కు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు.

#HindiDrushyam #Ajay Devagan #Sriya Saran #Drushyam 2 #Hindhi Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు