నగరంలో ఘోరం.. నమ్మించి నయవంచన చేసిన కామాంధులు.. ?

ప్రస్తుతం మనుషులు జీవిస్తున్నారని చెప్పుకుంటున్న ఈ సమాజం ఒక భయంకరమైన అడవి కంటే దారుణం.ఇక్కడ మనుషుల రూపంలో కౄరమైన మృగాలు సంచరిస్తున్నాయి.

 Panjagutta Ds Makta Rape Case-TeluguStop.com

రాతిపలకలుగా మారిన హృదాయాలు రాబందుల్లా మారిపోయాయి.

అందుకే ప్రతి అడుగులో ఆలోచన ఉండాలంటారు.

 Panjagutta Ds Makta Rape Case-నగరంలో ఘోరం.. నమ్మించి నయవంచన చేసిన కామాంధులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతి క్షణం జాగ్రత్త పడాలంటారు.ఇకపోతే ఎవరినైతే నమ్ముతామో వారే కీడు తలపెట్టేదాక తెలియదు.

కాగా హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట, డీఎస్‌ మక్తాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, ఆ ఇంటిలో ఒక అమ్మాయి(23) ఒంట‌రిగా ఉంది.అయితే ఈ విషయాన్ని గమనించిన కామాంధులు ఇద్ద‌రు నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వ‌చ్చి, తాము బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ ఇస్తామని యువతితో మాట‌లు క‌లిపారట.

నిజమని నమ్మిన ఆ అమాయకురాలు వారిని ఇంట్లో కూర్చో బెట్టి మాట్లాడుతుండగా వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడట.ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ యువతి పై అత్యాచారానికి ఒడిగట్టాడట.

ఈ ఘటన అనంతరం జరిగిన దారుణం పై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలనిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు.కాగా నిందితులను గుర్తించ‌డానికి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారట.

చూశారా ఒంటరిగా ఉన్న మహిళలు ఈ కాలంలో ఎవరిని నమ్మకండి.

#DS Makta #Rape Case #Police #Panjagutta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు