వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో..

Panja Vaishnav Tej Next Movie Official Announcement

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్.2020 లో టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టి ఉప్పెన లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఉప్పెన హిట్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.కరోనా తర్వాత టాలీవుడ్ ను మళ్ళీ కోలుకునేలా చేసిన సినిమాల లిస్టులో ఉప్పెన కూడా ఉంది.

 Panja Vaishnav Tej Next Movie Official Announcement-TeluguStop.com

మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత కూడా వైష్ణవ్ తేజ్ కే దక్కింది.వైష్ణవ్ తేజ్ కు మాత్రమే కాదు ఈ సినిమా దర్శకుడికి, హీరోయిన్ కు కూడా ఇది మొదటి సినిమానే.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఉప్పెన భారీ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేసాడు.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కానీ వైష్ణవ్ తేజ్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

ఈయన మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్టులో చేరిపోయాడు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు మరొక సినిమాను ప్రకటించాడు.

ప్రసెంట్ వైష్ణవ్ తమిళ డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు రంగ రంగ వైభవంగా, ఆబాల గోపాలం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని సమాచారం.

ఇది పక్కన పెడితే తాజాగా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా అనౌన్స్ చేసారు.ఈ రోజు ఈయన పుట్టిన రోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాతలు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసారు.ఇందులో తన 16వ సినిమాను వైష్ణవ్ తేజ్, ఫార్చ్యూన్ బ్యానర్ తో కలిసి నిర్మించ బోతున్నట్టు సితార ప్రకటించింది.ఈ సినిమా మిగతా డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నామని తెలిపారు.

#Vaishnav Tej #Vaishnav Tej #Sithara #PanjaVaishnav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube