ఈ హీరో బి.టెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడట...

తెలుగులో ఇటీవలే ప్రముఖ నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఎంతగానో అలరించాడు మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్.అయితే వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో మంచి సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ కి సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 Panja Vaishnav Tej Kondapolam Movie Story Leak-TeluguStop.com

అంతేకాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ కూడా బాగానే పెరిగిపోయింది.కాగా ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ విలక్షణ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” దర్శకత్వం వహిస్తున్న “కొండపొలం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రంలో వైష్ణవి తేజ్ సరసన యంగ్ బ్యూటీ “రకుల్ ప్రీత్ సింగ్” హీరోయిన్ గా నటిస్తోంది.

 Panja Vaishnav Tej Kondapolam Movie Story Leak-ఈ హీరో బి.టెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ తన బీ.టెక్ చదువును పూర్తి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించి ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేస్తుంటాడని ఈ క్రమంలో తన కుటుంబాన్ని మరియు పొలాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే కథాంశంతో అలరించనున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.అయితే తన మొదటి చిత్రంతో మంచి హైప్ క్రియేట్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రంపై కూడా భారీ అంచనాలే పెంచేశాడు.

మరి ఆశించిన స్థాయిలో కొండపోలం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల విడుదలకు కొంతకాలం పాటు వాయిదా వేశారు.

దీంతో తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు గతంలో తెలియజేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “హరిహర వీరమల్లు” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగరంలోని “రామోజీ ఫిలిం సిటీ” పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#PanjaVaishnav #Story Leak #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు