Pani Puri Health Department : పానీపూరీ తినేవారు ఇది చదవండి... ఆరోగ్యశాఖ హెచ్చరిక ఇదే!

పానీపూరీ అంటే ఇప్పటి యూత్ కి బాగా క్రేజ్ అని చెప్పుకోవాలి.ముఖ్యంగా అమ్మాయిలు వాటిని ఎందుకో మరి, లొట్టలేసుకుని మరీ తింటారు.

 Panipuri Eaters Read This This Is The Health Warning , Pani Puri, Viral Latest,-TeluguStop.com

అలా సరదాగా బయటకు వెళ్లినప్పుడల్లా వారు ఆరగిస్తూ వుంటారు.వారిలో స్టూడెంట్స్ ఎక్కువమంది వుంటారు.

ఈ వ్యాపారం చేసే చిరు వ్యాపారాలు కూడా కాలేజీ, స్కూల్స్ వున్నచోట బల్లను పెడుతూ వుంటారు.దాంతో తోపుడు బండి మీద అమ్మే పానీపూరీకి మనదగ్గర మంచి గిరాకీ ఉంటుంది.

ఐతే ఈ సీజన్‌లో పానీపూరీ తినడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అవును, పానీపూరి తినడం వలన ఇటీవల టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలు ఎక్కువగా ప్రబలుతున్నాయని అంటున్నారు.

ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.ఈ సీజన్‌లో ప్రజలు పానీపూరీ తినకపోవడమే మంచిదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది.

టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులు.టైఫాయిడ్‌కి మరోపేరు పానీపూరీ డిసీస్ అని కూడా చెప్పుకోవచ్చు అని ఆయన చమత్కరించారు.

పానీపూరీ నిర్వాహకులు ముఖ్యంగా శుచి శుభ్రత అనేది పాటించాలి.ఇందులో ఎక్కువగా కాచివడపోసిన నీటినే వినియోగించాలి.ముఖ్యంగా దోమలు, ఈగలు లేకుండా చూడాలి అని వ్యాపారులకు సూచించారు.పది పదిహేను రూపాయల పానీపూరీతో అనారోగ్య సమస్య వల్ల రూ.5వేలు ఖర్చవచ్చు… కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని శ్రీనివాస్ పేర్కొన్నారు.టైఫాయిడ్‌ను గోల్‌గప్పా డిసీజ్ అని కూడా పిలుస్తారు.

ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube