పానీపూరి ప్రియులకు గుడ్‌ న్యూస్‌... ఇకపై ఆ కంపు లేకుండానే ఆస్వాదించొచ్చు ఎలాగో తెలుసా?

ఇండియాలో అయినా మరెక్కడైనా హెల్తీ ఫుడ్‌ కంటే జంక్‌ ఫుడ్‌ ను ఎక్కువగా జనాలు ఇష్టపడి తింటారు.హెల్తీ ఫుడ్‌ రుచిగా ఉండదు.

 Pani Puri Automatic Water Serve Machine Safe For Our Health-TeluguStop.com

కాని పలు ఉపయోగాలు ఉంటాయి.కాని జంక్‌ ఫుడ్‌ రుచిగా ఉంటుంది.

కాని అనారోగ్య కారకాలు కలిగి ఉంటాయి.అయినా కూడా ప్రతి చోట జంక్‌ ఫుడ్స్‌ను తింటూనే ఉంటారు.

ఇండియాలో అత్యధికంగా టైంపాస్‌కు తినే ఫుడ్‌ పానీ పూరి.ఎంతో మందికి పానీ పూరి అంటే ఇష్టం.

కాని కొందరు పానీపూరి తయారు చేసే విధానం, గతంలో కొన్ని సందర్బాల్లో వచ్చిన వార్తలను చూసి తినాలంటే భయపడుతున్నారు.

పానీపూరి ప్రియులకు గుడ్‌ న్య�

అత్యంత అపరిశుబ్రమైన పదార్థాంగా పానీ పూరికి గుర్తింపు ఉంది.అందుకే ఇష్టమైనా కూడా పానీపూరిని తినరు.పానీపూరిని ముఖ్యంగా వాటర్‌లో చేయి పెట్టి అతడు ఇస్తూ ఉంటాడు.

ఆ వాటర్‌తోనే టేస్ట్‌ వస్తుంది.కాని ఆ వాటర్‌ ఎలా తయారు చేశాడో, అతడి చేతికి ఏం ఉందో అనే ఒకింత అసహ్యం అనిపిస్తుంది.

ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు.పానీ పూరికి కొత్త విధానం వచ్చింది.

గుజరాత్‌లో ప్రారంభం అయిన పానీపూరి మిషన్‌ పూర్తి స్వచ్చమైన పానీపూరిని వినియోగదారులకు అందిస్తుంది.

పానీపూరి ప్రియులకు గుడ్‌ న్య�

ప్రస్తుతం గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ పానీ పూరి మిషన్‌ ఎలా పని చేస్తుందంటే… పానీపూరి వ్యాపారి పూరిలో ఆలూ లేదా సమోసా పెట్టి ఇస్తాడు.అప్పుడు పక్కనే ఉండే మిషన్‌ వద్దకు వెళ్లి కావాల్సినంత పానీపూరి వాటర్‌ను తీసుకుని పూరిలో వేసుకుని తినేయవచ్చు.ఇలా చేయడం వల్ల అపరిశుభ్రతకు చోటే లేదని వినియోగ దారులు అంటున్నారు.

గతంలో 100 మంది తింటే ఇప్పుడు 500 మంది తినేందుకు వస్తున్నారని షాపు యజమాని అంటున్నారు.పానీపూరి ఇష్టం ఉన్నా చాలా మంది అపరిశుభ్రం అంటూ తినేందుకు ఇష్టపడటం లేదు.

ఇప్పుడు ఆ సమస్య తీరిందని వినియోగదారులు అంటున్నారు.ఈ మిషన్‌ మన వద్దకు ఎప్పుడు వస్తుందో కదా… త్వరలోనే వస్తుంది లేండి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube