ఏపీలో ప్రత్యక్షం అయినా అలుగు.. జనాలు ఏం చేశారంటే ?

మామూలుగా చాలామంది ఎన్నో జంతువులు చూసి ఉంటారు… కానీ అలుగు లాంటి జంతువును చూడటం చాలా అరుదు.ఎందుకంటే ఒకప్పుడు అయితే ఇవి అటవీ ప్రాంతంలో చాలా ఎన్నో ఉండేవి కానీ ప్రస్తుతం వీటి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.

 Pangolin, Prakasam District, Ap, Viral Video-TeluguStop.com

ఎంతలా అంటే ఇంకొన్ని రోజుల్లో ఇలాంటి జీవులు ఒకప్పుడు ఉండేవి అని ఫోటోలో చూడడం తప్ప డైరెక్ట్ గా చూడలేనంతగా వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది, ఎందుకంటే ఈ అలుగు ఔషధ తయారీకి ఉపయోగపడుతుంది కాబట్టి.

మామూలుగా అలుగులు కనిపించటం చాలా అరుదు.

ఇక దీని గురించి తెలియని వారికి, మొదటిసారి చూసిన వారికి అయితే దీని ఆకారం చూస్తే కాస్త భయం వేస్తుంది.తల భాగం నుంచి తోక వరకు పూర్తిగా పోలుసులతో నిండి ఉంటుంది.

ఇక ఈ పొలుసులు ఎంతో గట్టిగా ఉంటాయి.ఎంతలా అంటే ఈ అలుగు ప్రాణ రక్షణ కోసం ముడుచుకున్న సమయంలో తుపాకీతో కాల్చిన ఒక బుల్లెట్ లోపలికి దిగదు దాని పొలుసులు అంత ధృడంగా ఉంటాయి.

అయితే ఈ అలుగుకు ఉండే పొలుసులు దీనికి ఏదైనా అపాయం జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగపడుతూ ఉంటుంది, ప్రస్తుతం మాత్రం అలుగుకు రక్షణ కలిగించే పొలుసులే దానికి శాపంగా మారుతున్నాయి.అలుగుకు ఉండే పొలుసులు క్యాన్సర్ తయారీలో వినియోగిస్తారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు అలుగులపై పై దృష్టి పెట్టారు.

దీంతో ఎంతో అరుదుగా ఉండే ఈ అలుగులను వెంటాడి వేటాడి మరి ఏకంగా స్మగ్లింగ్కు పాల్పడుతున్నారట, ఇది ఇలాగే కొనసాగితే అలుగు అనేది కనిపించకుండా పోవడం ఖాయం అన్నది అందరికి తెలిసిన నిజం.ఇటీవలే ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపల్లెలో స్థానికులకు అలుగు కనిపించడంతో వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి ఈ అలుగును అప్పగించారు.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube