Pandas Playing: వైరల్: మంచులో ఆడుతున్న పాండాలు... ఫిదా అయిపోతున్న నెటిజన్లు!

మనకి కొన్ని జంతువులు చూడ్డానికి అందగా, బొద్దుగా, ముద్దుగా కనబడుతూ ఉంటాయి.అందులో ముఖ్యంగా పాండాలు ఒకటి.

 Panda Playing In Snow Funny Video Viral Details, Snow , Panda, Playing, Viral L-TeluguStop.com

ఇక అవి చేసే అల్లరి పనులు చూస్తే మనకి ఎంతగానో నవ్వు వస్తూ ఉంటుంది.తాజాగా పాండాకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.

ఆ పాండా చేస్తున్న అల్లరికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.వాషింగ్టన్ డీసీలోని స్మిత్​సోనియన్ నేషనల్ జూలో పాండా మంచులో హాయిగా ఆదుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో క్లిప్పింగ్​ను నేచర్ అండ్ యానిమల్స్ అనే ఖాతా నుంచి ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

కాగా ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, పాండా మంచుపై దొర్లుతూ ఆడుకుంది.

అమాయకమైన ఎక్స్​ప్రెన్స్​తో ఎంజాయ్ చేయడం మనకు కనబడుతుంది.ఈ వీడియో చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించడంలో నెటిజన్లకు బాగా నచ్చేసింది.

దాంతో షేర్స్ చేసుకుంటున్నారు.ఇప్పటికే ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రాగా… లైక్​లు, కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

పాండాలు చాలా క్యూట్​గా ఉంటాయని, వాటితో ఆడుకోవాలని ఉందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

కావాలంటే ఇక్కడ వున్న వీడియో చూడండి, వావ్ అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు మీరు.ఒకసారి నెటిజన్ల కామెంట్లు చూస్తే, పాండాలా తమకు మంచులో అలా పొర్లాలని ఉందంటూ ఒకరు కామెంట్ చేస్తే, అలా చేస్తే మనకు వెంటనే జలుబు చేస్తుందని కొందరు అంటున్నారు.మరికొంతమంది పాండా ఆడుకుంటున్న వీడియో చూసిన తరువాత తమలోని ఆందోళన, ఒత్తిడిని మరిచామని, ఉపశమనంగా కూడా ఉందని అంటున్నారు.

మరెందుకాలస్యం మీరు కూడా ఆ క్యూట్ వీడియో చూసి మీమీ అభిప్రాయాలను మాకెంట్ల రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube