పూర్వం శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణపత్యాలలో అనేక విభేదాలు ఉండటంవల్ల వాటిని దూరం చేసి అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతటా వ్యాపింప చేయాలన్న ఉద్దేశంతోనే ఆదిశంకరులు షణ్ముతాలను ఏర్పాటు చేశారు.అసలు ఈ పంచాయతనం అంటే ఏమిటి? పంచాయతనం విశేషాలు ఏమిటి? అన్న విషయాలను గురించి కూడా తెలుసుకుందాం.
పంచ అంటే ఐదు అని అర్థం.అతనం అంటే సమూహం.ఐదుగురు దేవతా మూర్తులు ఒకే పీఠంపై కొలువై ఉండడాన్ని పంచాయతనం అంటారు.స్కంద పురాణం ప్రకారం శివుడు, విష్ణువు ,గణపతి, అమ్మవారు, సూర్యుడు అయిదుగురు దేవతలకు ప్రత్యేకంగా జరిగే పూజా కార్యక్రమాలనే పంచాయతనం అంటారని శ్రీ శంకరాచార్యుల వారు తెలియజేశారు.
ఒకప్పుడు జైన,బౌద్ధ మతాలు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, శైవ,వైష్ణ, సౌర అన్న షణ్మతాలు ప్రబలమై ప్రజలు ఒకరికొకరు అపకారం చేసుకుంటున్న సందర్భంలో శంకరాచార్యులవారు ఈ పంచాయతనం గురించి ప్రజలకు తెలియజేశారు.మతాల అన్నింటిని స్వయం కావించి, పూజా సమయంలో అగ్ని తప్పనిసరిగా చేసి, పంచాయతన పూజా విధానాన్ని రూపొందించారు.
భగవద్గీతలో గీతాచార్యుడు ఆకాశం నుంచి వాయువు ఏర్పడుతుందని, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఔషధములు, ఔషధాలు నుంచి ఆహారం, ఆహారం మంచి సమస్త ప్రాణకోటి ఏర్పడుతుందని తెలియజేశారు.అయితే ఈ పంచాయతనం లో ఉన్న ఒక్కో దేవుడికి ఒక్కో తత్వాన్ని కల్పించారు.
శివుడు ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటే అమ్మవారు వాయు తత్వాన్ని కలిగి ఉన్నారు.సూర్యుడు అగ్ని తత్వాన్ని, విష్ణుమూర్తి జలతత్వాన్ని, గణపతి పృథ్వి తత్వాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు.
అయితే ఈ పంచాయతనం అర్చన నిర్వహించేటప్పుడు ప్రాతః కాల సమయంలో విధిగా ఆచరించాలన్నది శాస్త్రం చెబుతోంది.ఇలా కులమత బేధాలు వివక్షత లేకుండా అన్ని మతాల దేవతామూర్తులను ఈ విధంగా పంచాయతనం ద్వారా పూజించడం వల్ల శుభం కలుగుతుంది.