హైకోర్టు తీర్పు ! తెలంగాణాలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు  

మూడు మాసాల్లోపు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. పంచాయితీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగానికి విరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. మూడు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

Panchayat Elections In Three Months Telangana Order By High Court-

Panchayat Elections In Three Months In Telangana Order By High Court

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై గురువారం నాడు కోర్టు విచారణ జరిపింది. మూడు మాసాలు మాత్రమే ప్రత్యేక అధికారులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మూడు మాసాల్లోపుగా ఎన్నికల నిర్వహణకు గాను చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.