తెలంగాణాలో ఆ ఎన్నికల తరువాతే ... ఈ ఎన్నికలు జరుగుతాయా...?

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దిగ్విజయంగా జరిగాయి.ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుపు జెండా ఎగురవేసింది.

 Panchayat Elections In Telangana 2018-TeluguStop.com

ఆ ఎన్నికల తంతు పూర్తయ్యింది అనుకుంటున్న సమయంలో ….లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరి వారంలో రాబోతోందని.ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేయడం… ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.సాధారణంగా… సార్వత్రిక ఎన్నికలకు ప్రతీ సారి.అదే ఫిబ్రవరి చివరి వారం లేదా.మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది.కానీ అనుకోకుండా… పంచాయతీ ఎన్నికలు కోర్టు చెప్పిన ప్రకారం.జనవరి ఐదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది.

కానీ.అది ఇప్పుడప్పుడే అయ్యేలా కనిపించడంలేదు.

జనవరి పదిలోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.అయితే ఆ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.

కానీ కోర్టు విధించిన గడువు లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవడం కష్టం.

ఎందుకంటే… పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఒకటి కనిపిస్తోంది.పంచాయతీ రిజర్వేషన్ల ఖరారుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది.కానీ….బీసీల జనాభా లెక్కలు ప్రభుత్వం సక్రమంగా లేవు.అవి అందిన తర్వాత వార్డు, సర్పంచ్ ల రిజర్వేషన్లను పూర్తి చేయాల్సి ఉంది.ఇవన్నీ జనవరి ఐదు లోపు సాధ్యం కాదని.ఎన్నో రకాల సమస్యలు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సుప్రీం ఆదేశాల మేరకు పంచాయతీల్లో రిజర్వేషన్లను 50 మించరాదని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.దీని ప్రకారం ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా పంచాయతీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు.

దీనిపైనా.బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ఇవన్నీ పక్కనపెడితే….ఇప్పుడిప్పుడు పంచాయతీ ఎన్నికలు మీద ఫోకస్ పెడితే….పార్లమెంట్ ఎన్నికల మీద ఆ ప్రభావం కనిపిస్తుందని….టీఆర్ఎస్ భావిస్తోంది.కానీ… టీఆర్ఎస్ గెలుపు జోష్ లో ఉంది.ఆ పార్టీలో ఉన్న చిన్నా చితకా నాయకులంతా కలిసి పార్టీ విజయానికి పని చేశాయి.

కానీ పంచాయతీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.ఆ ఐక్యత ఉండదు.

గ్రామా స్థాయిలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉంటాయి.అంటే పార్టీలోని నాయకులూ రెండు వర్గాలుగా విడిపోతుంది.

ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉండదు.అదే జరిగితే.

మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం పడుతుంది.అందుకే.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.ఈ నేపథ్యంలో కోర్టులో ఏదో ఒక సాకు చూపించి ఎన్నికలు వాయిదా వేయించేలా టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube